YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాఫెల్ డీల్ : పార్లమెంట్ లో కాగ్ నివేదిక

రాఫెల్ డీల్ : పార్లమెంట్ లో కాగ్ నివేదిక

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై ఎట్టకేలకు ప్రభుత్వం కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. విమానాల కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వానికి కాగ్ క్లీన్ చిట్ ఇచ్చింది. గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి, దాని స్థానే కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి మధ్య వ్యత్యాసాన్ని బయటపెట్టింది. రాఫెల్ డీల్ 2.86 శాతం తక్కువ ధరకే కుదిరినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ 4.77 శాతం తగ్గిందని తెలిపింది. భారత్ అవసరాలకు తగ్గట్టు సాంకేతిక మార్పులు చేయడంతో 17.08 శాతం తగ్గిందని కాగ్ పేర్కొంది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గిందని పేర్కొంది. కాగా ఇంజనీరింగ్ సపోర్ట్ ప్యాకేజీలో 6.54 శాతం పెరిగిందని, టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్మెంట్లో 0.15 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. పైలట్, టెక్నీషియన్స్ శిక్షణలో 2.68 శాతం పెరిగిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.  2007లో కంటే 2016లో 36 ఫ్లైఅవే విమానాల ధర 9 శాతం తక్కువ అంటూ రక్షణ శాఖ చేస్తున్న వాదనను కాగ్ కొట్టిపారేసింది. రాఫెల్ ఒప్పందంలో 14 పరికరాలతో 6 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఏడు పరికరాల కోసం ఒప్పందం చేసుకున్న ధరలు హేతుబద్ధమైన ధర కంటే ఎక్కువగా ఉన్నాయి. సాధారణ విమానం సహా మూడు పరికరాలు కూడా అదే ధరకు కొనుగోలు చేశారు. నాలుగు పరికరాలను మాత్రం అసలు ధర కంటే తక్కువ ధరకు కొన్నారు. 2007 ఒప్పందం కంటే ఒకనెల ముందుగానే తాజా ఒప్పందం తాలూకు యుద్ధ విమానాలు దేశానికి వస్తాయి. గత ఒప్పందంలో గడువు 72 నెలలుగా ఉండ  2016 ఒప్పందం ప్రకారం 71 నెలల్లోనే ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానాలు సరఫరా అవుతాయి. 2007 ఒప్పందం ప్రకారం సంతకాలు జరిగిన 50 నెలల్లో 18 విమానాలు సరఫరా చేయాల్సి ఉంది. తర్వాతి 18 విమానాలు హెచ్ఏఎల్లో తయారు చేసి  ఒప్పందం కుదిరిన 49 నుంచి 72 నెలల్లోగా అందించాలి. అయితే 2016 కాంట్రాక్టు ప్రకారం  తొలి 18 విమానాలు 36 నుంచి 53 నెలల్లోగానూ, మిగతా 18 విమానాలు 67 నెలల్లోగా అందించాల్సి ఉంటుంది. న్యాయశాఖ సలహా మేరకు రక్షణ శాఖ ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి సావరిన్ గ్యారంటీ కోరింది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం కేవలం ‘‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’  మాత్రమే ఇచ్చింది. ఆర్ధిక భద్రత కోసం ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లింపులు చేయాలని రక్షణ శాఖ కోరినప్పటికీ ఫ్రాన్స్ అందుకు అంగీకరించలేదు. 

Related Posts