YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేబినెట్‌ రైతులు, డ్వాక్రా మహిళలపై వరాల జల్లు

 కేబినెట్‌ రైతులు, డ్వాక్రా మహిళలపై వరాల జల్లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఏపీ కేబినెట్‌ రైతులు, డ్వాక్రా మహిళలపై వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప జేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రతి రైతు కుటుంబానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో కేంద్రం అందిస్తున్న 6 వేల ఆర్ధిక సాయం కూడా ఉందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కేంద్రం పథకం వర్తించని వారికి కూడా 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్‌‌, రబీ సీజన్‌లకు వేర్వేరుగా రెండు విడతల్లో ఐదు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ పథకం అమలుచేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 7 వేల 621 కోట్ల రూపాయల భారం పడనుంది. అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతుకు 10 వేల రూపాయల మేర ఆర్ధిక సాయం అందనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 76.21 లక్షల కమతాలు ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలలోపు కమతాలు కలిగిన రైతులు 60 లక్షల మంది ఉన్నారు. తక్షణమే చెక్కులు సిద్ధం చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి రైతులకు అందించనుంది. ఇదే సమయంలో రుణమాఫీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను రెండు విడతల్లో చెక్కుల ద్వారా చెల్లించాలని నిర్ణయించింది ఇక డ్వాక్రా మహిళలపై కూడా కేబినెట్ వరాల జల్లు కురిపించింది. ఇప్పటికే పసుపు కుంకుమ కార్యక్రమంతో 10 వేల రూపాయలు అందించిన ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఫోన్లతో పాటు సిమ్‌ కార్డులు కూడా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు మూడు సంవత్సరాలు ఇన్‌ కమింగ్ ‌, అవుట్ గోయింగ్ సౌకర్యం ఉండేలా ఫోన్లను అందించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
విధి విధానాలు ఇవే 
నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10వేలు అందజేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఖరారుచేసిన మంత్రివర్గం, కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. అంతేకాదు కేంద్ర పథకానికి అర్హులు కానివారికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ.10 వేలు అందజేయనుంది. కౌలు రైతులను కూడా ఇందుకు అర్హులుగా పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఖరారుచేసిన విధివిధానాలను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు మాత్రమే కేంద్రం ఏడాదికి రూ.6వేలు చెల్లిస్తుందని, తాము ప్రతి రైతు కుటుంబానికీ, కౌలు రైతులకు రూ.10 వేలు చొప్పున అందజేస్తామని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను కేటాయించామని, రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి నెలాఖరు కల్లా కేంద్రం జమచేసే రూ.2వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3వేలు జమచేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఐదు ఎకరాల షరతును రాష్ట్ర ప్రభుత్వం విధించదు అని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే జిల్లా ఆస్పత్రుల స్థాయి పెంపునకు క్యాబినెట్ ఆమోద తెలిపింది. పంచాయతీ కంటిజెన్సీ ఉద్యోగులకు జీతాలు పెంపు, ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, తదితర కీలక నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Related Posts