యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వాలెంటెన్స్ డే దగ్గరకు వచ్చేసింది. ఇష్టమైన వారికి స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటే.. శాంసంగ్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. బెస్ట్ డేస్ పేరుతో గెలాక్సీ నోట్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, బండిల్ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ నోట్ 9 (8 జీబీ ర్యామ్+ 512 జీబీ మెమరీ) అసలు ధర రూ.84,900. దీనిపై రూ.7,000 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అప్పుడు దీని ధర రూ.77,900లకు వచ్చినట్లు అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులు అదనంగా రూ.8,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీంతో ఫోన్ మొత్తంగా రూ.69,900లకు వచ్చినట్లు అవుతుంది. అదే మీ వద్ద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లేకపోతే.. అప్పుడు మీరు అప్‌గ్రేడ్ ఆఫర్ కింద ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో అదనంగా రూ.9,000 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ రూ.58,900లకు, 8 జీబీ ర్యామ్/512 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.68,900లకు అందుబాటులో ఉంది. ఇంతటితో అయిపోలేదు. గెలాక్సీ నోట్ 9 ఫోన్ కొన్నవారు గెలాక్సీ వాచ్ (42ఎంఎం)ను రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.24,990. అంటే మీకు రూ.14,991 డిస్కౌంట్ లభిస్తోంది.
గెలాక్సీ ఎస్9 ప్లస్
కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.7,000 తగ్గించింది. ఈ తగ్గింపు అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. దీంతో 64 జీబీ వేరియంట్ ధర రూ.57,900గా ఉంది. 128 జీబీ మోడల్‌ను రూ.61,900కు కొనుగోలు చేయవచ్చు. 256 జీబీ వేరియంట్ ధర రూ.65,900గా ఉంది. ఈ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులు రూ.6,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీంతో గెలాక్సీ ఎస్9 ప్లస్ ధర రూ.51,900 నుంచి ప్రారంభమౌతుంది. గెలాక్సీ నోట్ 9 మాదిరిగానే గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌పై కూడా రూ.9,000 అప్‌గ్రేడ్ బోనస్ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు లేనివారు వారి పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చి ఈ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.