యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్‌సభలో ఇవాళ ప్రధాని మోదీ ప్రసంగించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పాత్రను ఆయన మెచ్చుకున్నారు. స్పీకర్ సభను నిర్వహించిన తీరు పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం దేశ ప్రజల కోసం పనిచేశామన్నారు. మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఇద్దరు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇచ్చామన్నారు. మొదటిసారి ఎక్కువ సంఖ్యలో తమ ప్రభుత్వంలో మహిళా ఎంపీలు ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుత లోక్‌సభలో అనేక సమావేశాలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. ఇదో శుభపరిణామం అని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులుగా వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ అద్భుతంగా పనిచేశారన్నారు. భారత్ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. ఇది పాజిటివ్ సంకేతమన్నారు. అలాంటి విశ్వాసమే అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ప్రపంచం అంతా గ్లోబల్‌వార్నింగ్ గురించి చర్చిస్తోందని, ఆ సమస్యను తీర్చేందుకు భారత్ సౌరశక్తికి పెద్ద పీట వేసిందన్నారు. అంతకుముందు కూడా స్పీకర్ మహాజన్‌ను సభ్యులందరూ అభినందించారు.