YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ

 ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు     లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు. 2014లో లోక్‌సభకు తొలిసారి వచ్చినప్పుడు అంతా కొత్తగా అనిపించేందని,  ప్రతి అంశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి అర్థం చేసుకున్నానని చెప్పారు.  ‘‘దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని  అవినీతిపై పోరాటం చేశాం. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా అనేక చట్టాలు చేసిన ఘనత మాదే.  జీఎస్టీ బిల్లు తెచ్చి దేశ ఆర్థిక రంగ రూపురేఖలు మార్చాం. మా పాలనలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశాం.  పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.  ఉపగ్రహాల ప్రయోగాల్లో గొప్ప అభివృద్ధి సాధించాం. ఈ ఐదేళ్లలో ప్రపంచంలో భారత్‌ గొప్పదనం పెరిగింది. మా పాలనలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు వివాదం పరిష్కారమైంది. ప్రకృతి విపత్తులతో కష్టాలు ఎదుర్కొన్న దేశాలకు ఎంతో సాయం చేశాం. మానవతా దృక్పథంతో అనేక రకాలుగా సాయం చేశాం. నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులకు సహాయ సహకారాలు అందించా మన్నారు.సభాపతి, రక్షణమంత్రితోపాటు ఈ లోక్‌సభలో 44 మంది మహిళా సభ్యులు ఉండటం గర్వకారణమన్నారు. 16వ లోక్‌సభ సమయంలో దాదాపు 85శాతం పనులు పూర్తి చేశామని ప్రధాని వెల్లడించారు. ‘‘ఈ ఐదేళ్లలో భూతాపం తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టాం.  ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలన్నీ భారత్‌ను ప్రశంసిస్తున్నాయి. గర్భిణులకు 26 వారాలపాటు సెలవులు ఇవ్వాలని చట్టం చేశాం. ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయి. ఐరాసలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ జయంతులు నిర్వహిస్తున్నారు.  కొందరు భూకంపం తెస్తామన్నారు.. కానీ అదేమీ రాలేదు. భూకంపాలను తట్టుకుని లోక్‌సభ ఔన్నత్యం పెంపొందింది. ఈ సభలో 203 బిల్లులు ఆమోదం పొందాయి.  ఓబీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం కమిషన్‌ వేశాం. అక్రమాలు అరికట్టేందుకు ఆధార్‌ కార్డు ఎంతో ఉపయోగపడుతోంది. డిజిటల్‌ ప్రపంచంలో భారత్‌ స్థానం సుస్థిరం అయింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు చేపడతాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.

Related Posts