యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతి స్మార్టుసిటి పథకంలో వెయ్యికోట్లు పైగా టెండర్లుపూర్తిచేశామని రాష్ట్రంలో తిరుపతి ,రాజమండ్రి ,విశాఖ స్మార్టుసిటి పథకంలో ఉండగా తిరుపతి టెండర్లుపూర్తి చేయడంలో నంబర్‌వన్‌గా ఉందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో తనచాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో స్మార్టుసిటి పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. అమృత్ పథకంలో రూ 77కోట్లతో 14నీటి ట్యాంకులు,పార్కులు అభివృద్ది పనులు జరుగుతున్నాయి. భూగర్బవిదుద్దీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్లాస్టిక్ నిషేదంతో ప్రజల్లో కొంత వరకు చైతన్య వచ్చిందని,మరింత పటిష్టంగా ప్లాస్టిక్ నిషేదం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇంటింటా చెత్తసేకరణ విజయవంతంగా అమలు చేస్తున్నామని మరింత పటిష్టంగా అమలు చేయడానికి తమ సిబ్బంది కృషి చేస్తారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వార్డులో పనిచేసే సిబ్బందికి బ్యాటరీ ద్విచక్రవాహనం, లేదా సోలార్‌తో నడిచే ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసి కాలుష్యనివారణకు కృషి చేయనున్నట్లుచెప్పారు. రాష్ట్రంలోనే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డస్ట్‌బిన్ లేనినగరంగాచేయడం వల్ల నంబర్‌వన్‌స్థానంలో ఉందని కమిషనర్ విజయరామరాజు తెలిపారు. చాలాచోట్ల డస్ట్‌బిన్‌లు లేవని కేవలం కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయని అవికూడా త్వరలలో తొలగించి మున్సిపల్ సిబ్బందే నేరుగా ఇంటికి వచ్చి చెత్తతీసుకుపోతారు. ప్రజలు కూడా తడి,పోడిచెత్త సేకరణ వేరువేరు పెట్లుకోని ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారుచేసుకునే పద్దతి నేర్చుకుంటే బాగుంటుందన్నారు. దినిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కమర్షియల్ భవనాలకు యూజర్ చార్జీల వసూళ్లు చేయడం వల్ల వారిలో చైతన్యం వచ్చిందన్నారు.