YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఇక 13 డిజిట్ల మొబైల్ నంబర్లుంటాయి

Highlights

  • ఫోన్ నంబర్లలో 10 కాదు.. 13 అంకెలుంటాయ్..!
  • 10 డిజిట్ ఫోన్ నంబర్లు కూడా మారతాయి 
  • జూలై 1 నుంచి అమలు 
ఇక 13 డిజిట్ల మొబైల్ నంబర్లుంటాయి

 మొబైల్ వినియోగదారులకు మరింత సెక్యూరిటీని అందించే దృష్ట్యా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) టెలికాం ఆపరేటర్లకు 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆపరేటర్లందరూ దీనికి తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 1 నుంచి దేశంలోని మొబైల్ వినియోగదారులందరికి 13 డిజిట్లతో కూడిన మొబైల్ నంబర్లను మాత్రమే ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే ఉన్న 10 డిజిట్ ఫోన్ నంబర్లను వాడే వారి నంబర్లను కూడా 13 డిజిట్లకు మార్చనున్నారు. ఇందుకు గడువును

ఈ ఏడాది డిసెంబ‌ర్ 31వ తేదీ వరకు విధించ‌గా ఈ ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 1, 2018 నుంచి ప్రారంభం కానుంది. సిమ్‌తో నడిచే మెషిన్ టు మెషిన్ పరికరాలన్నింటికీ 13 అంకెల ఫోన్ నంబర్ విధానాన్ని అమలు చేయనున్నారు.

Related Posts