YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబుకు బిగిస్తున్న ఓటుకు నోటు కేసు

బాబుకు బిగిస్తున్న ఓటుకు నోటు కేసు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
ఓటుకు నోటు కేసు విచారణకు టైం వచ్చేసింది. సరిగ్గా ఎప్పుడు దీని విచారణ వేగవంతం చేయాలో అప్పుడే మొదలైందా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వాలు కొలువైన సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్ట్టించింది ఓటుకు నోటు కేసు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్యెల్సీ గా వున్న స్టీఫెన్ సన్ కు ఐదు కోట్ల రూపాయలను ఆఫర్ చేశారు అప్పటి టిడిపి నేత నాటి ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి. అడ్వాన్స్ గా 50 లక్షల రూపాయలను అందజేస్తూ అడ్డంగా ఎసిబి ట్రాప్ లో కెమెరాల్లో రికార్డ్ అయి మరీ బుక్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఎపి సీఎం చంద్రబాబు ఫోన్ లో మావాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలే రేగేలా చేశాయి.ఈ కేసుతో ఉలిక్కిపడిన ఎపి సర్కార్ వెంటనే తెలంగాణ సర్కార్ పై ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆంధ్ర లో నమోదు చేసి మరో సంచలనానికి తెర లేపింది. మీ పోలీసులు మీకు వున్నారు. మా పోలీసులు మాకు ఉన్నారంటూ ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడ్డారు చంద్రబాబు. అయితే తెగేదాకా లాగితే ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇబ్బందులు తప్పవని కొందరు మధ్యవర్తులు హెచ్చరించడంతో లోపాయికారీ ఒప్పందాన్ని నాటి కేంద్ర మంత్రి ఒకరు సెటిల్ చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఇప్పటికి నడుస్తుంది. ఈ కేసును అటక ఎక్కించాలంటే కెసిఆర్ పెట్టిన కండిషన్ల ప్రకారం ఎపి నుంచే చంద్రబాబు పాలన చేసుకోవాలి. దాంతో సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లో ఉండేందుకు భారీ గృహ నిర్మాణాన్ని మొదలు పెట్టిన ఎపి సీఎం సైలెంట్ గా అమరావతి వచ్చేశారు. తెలంగాణ టిడిపి ని కానీ ఇతర సమస్యలు పదేళ్ళు ఆంధ్రులు కు చట్ట ప్రకారం వున్న హక్కులు అన్ని వదిలేశారు. కెసిఆర్ పై విమర్శలు కట్టిపెట్టారు. ఆయన్ను అమరావతి శంఖుస్థాపనకు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అదే రీతిలో కెసిఆర్ సైతం ఆయన్ను తన యాగానికి ఆహ్వానించారు. ఇలా ఇద్దరు కుదుట పడ్డారు అనుకున్నాక రాజకీయాలే ఇద్దరి మధ్య మరోసారి అగ్గి రాజేశాయి.తెలంగాణ లో టీఆరెస్ తో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారు. దీనికి ఆ పార్టీ అంగీకరించకపోవడంతో ఆయన కాంగ్రెస్ తో చేతులు కలిపి మహాకూటమి ఏర్పాటు చేసి కెసిఆర్ కి తొడకొట్టేశారు. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమ్మి రిటర్న్స్ లా ఓటుకు నోటు కేసు సమయం చూసుకుని బయటకు వస్తుందని అందరు ఊహించిందే. సరిగ్గా అదే జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ముందు, ఎపి అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కి రంగం సిద్ధం అయ్యిందని భావిస్తున్న తరుణంలో ఈడీ ఈ కేసులో విచారణ మొదలు పెట్టేసింది. దాంతో అటు టి కాంగ్రెస్ లో వున్న రేవంత్ రెడ్డి, ఇటు టి టిడిపి ఉలిక్కి పడింది. ఇప్పటికే ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిని ఈడీ కుమారుడితో సహా గంటల తరబడి విచారించేసింది. మరో నిందితుడు రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది.ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకు ఎపి సిఎం తన ఫోన్ సంభాషణ పై క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు. ఆ వాయిస్ తనదే అని కానీ, కాదని కానీ చెప్పకపోవడం గమనార్హం. వాస్తవానికి చంద్రబాబు తనమాటల్లో ఎక్కడా డబ్బు ప్రస్తావన తేలేదు. స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెట్టే పదజాలం వినియోగించలేదు. చట్టవిరుద్ధమైన సంభాషణలు చేసింది లేదు. కానీ ఆయన ఈ కేసు ఊసులెత్తితే అగ్గిరాముడే అవుతున్నారు. ముందుగా మోడీ ఆ తరువాత జగన్, కెసిఆర్ లపై నిప్పులు చెరిగేస్తున్నారు. కేంద్రంపై ఇప్పుడు యుద్ధానికి దిగిన బాబుకు ఈ కేసులో ఎలాంటి నోటీసులు వంటివి అందినా ఎన్నికల తరుణం కావడంతో రాజకీయంగా ఈ కేసును చక్కగా వినియోగించుకుంటారని విశ్లేషకులు లెక్కేస్తున్నారు. మారిన రాజకీయ వాతావరణంలో ఈ కేసు పురోగతి ఇకపై ఎలా ఉంటుందో అన్న ఆందోళన మాత్రం టిడిపి లో అంతర్గతంగా వున్నా జాతీయ స్థాయిలో బాబుకు పెరిగిన మద్దతుతో గతం కన్నా ధీమాగానే వున్నారు తమ్ముళ్ళు. బాబును టచ్ చేస్తే మోడీ కక్ష సాధింపు అన్న రీతిలో ప్రకంపనలు తెచ్చేందుకు అంతా సిద్ధమైన నేపథ్యంలో ఈ కేసులో ఈడీ ఇకపై వేయబోయే అడుగులు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఎలాంటి పరిస్థితి ని అయినా ఎదుర్కొనేందుకు పసుపుదళం సర్వదా సిద్ధం గా ఉండటం విశేషం.

Related Posts