యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎపి ప్రభుత్వం పని తీరు ఆశాజనకంగా లేదు. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందంటూ నాలుగేళ్లుగా చెప్పుకుంటూ.. ఇక్కడ మాత్రం ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు పప్పు, బెల్లాలను ప్రజలకు పంచుతున్నారని తెరాస ఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ లు, ఫెడరేషన్ ల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. డైరీ ఫాం ల నిర్వాకులకు నిర్వహణ ఖర్చు రావడం లేదు.. కానీ హెరిటేజ్ మాత్రం ఐటి రిటర్న్స్ కడుతున్నారు. ఆ మంత్రం ఏదో చెబితే వారు కూడా బాగుపడతారని అన్నారు. తెలంగాణాలో కేసిఆర్24గంటలూ కరెంటు ఇస్తున్నారు.. ఎపి లో మాత్రం మాటలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు రైతులకు పది వేలు అంటూ కొత్త తాయిలం ప్రకటించింది. కేంద్రం ఇస్తున్న కేంద్రం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటిస్తే ఐదు శాతం కాపులకు చంద్రబాబు ఎలా కేటాయిస్తారని అయన ప్రశ్నించారు. కేంద్రం విధివిధానాలు ప్రకటించకుండా చంద్రబాబు నిధులు ఎలా ఇస్తారు. నాలుగేళ్లలో డ్వాక్రా వారికి ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు పది వేలు ఇవ్వడం ఎన్నికల తాయిలమే. చంద్రబాబు తాజాగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్నికలు అయ్యేంత వరకే.. తర్వాత అన్నీ ఎత్తేస్తారు. మళ్లీ ఇప్పుడు సింగపూర్ తరహా రాజధాని చేస్తామని గొప్పగా చెబుతున్నారు. హోదా సంజీవని కాదు, వద్దు, ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మూడేళ్ల క్రితం ఈ స్థాయి లో చంద్రబాబు పోరాటం చేసి ఉంటే హోదా వచ్చేదేమో.. ఇప్పుడు ఎన్ని చేసినా అది సాధ్యం కాదు. బిసిలను అన్ని విధాలుగా చంద్రబాబు తొక్కేసి, బిసిల పార్టీ గా చెప్పుకుంటున్నారు. అందుకే ఎపి లో బిసిలకు నాయకత్వం వహించి అందరినీ కలుపుకెళ్లేలా సమావేశాలు నిర్వహిస్తామ ని అన్నారు. యన్టీఆర్ ఉన్న సమయంలో బిసిలకు ప్రాధాన్యత ఉంది.. ఇప్పుడు ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. అవినీతి లో కూడా ఎపి ముందంజలో ఉంది, ఏ పని కావాలన్నా డబ్బు ఇవ్వాల్సిందే. తెలంగాణలో అన్నీ ఆన్ లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా కేసిఆర్ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు తాను ఏం చేస్తే అదే రైట్ అని, అందరూ అదే అమలు చేయాలని భావిస్తున్నారని అయన అన్నారు. ప్రజలు అన్నీ తెలుసుకున్నారు.. వచ్చే ఎన్నికలలో మంచి నిర్ణయం తీసుకుంటారు. నాకు ఎపికి వచ్చే హక్కు లేదా.. నేను ప్రెస్ మీట్ లు పెట్టకూడదా అని నిలదీసారు. నేను విజయవాడ వస్తే పోలీసులను పంపి విచారణ చేయిస్తారా. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లో ఇన్ని కోట్లు పెట్టి పత్రికలు, ఛానళ్లలో ప్రకటనలు అవసరమా అని అడిగారు. ధర్మపోరాట దీక్ష లకు పది కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేయడం ఎంత వరకు సబబు. చంద్రబాబు ఇచ్చే ఎన్నికల తాయిలాలను ఎవరూ నమ్మవద్దని కోరుతున్నానని అన్నారు. ఎపికి మా అండదండలు ఉంటాయని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రకటించారు. కానీ చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తూ మాకు మోడి, జగన్, పవన్ లతో ముడి పెట్టారు. ఎపి లో చంద్రబాబు పాలన గాడి తప్పింది, ప్రత్యామ్నాయ పార్టీ ని ఎంచుకోవాలని ప్రజలను కోరుతున్నామని అయన అన్నారు.