YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఒక్క రోజే 2476 మందికి ఉద్యోగాలు

ఒక్క రోజే 2476 మందికి ఉద్యోగాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగాల భర్తీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 20 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది.  ఒకే రోజు 2,476 మందికి కొలువులు ఇచ్చింది. దీంతో టీఎస్‌పీఎస్సీ 20 వేల ఉద్యోగాల మైలురాయిని దాటింది. 2,476 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ (ఎఫ్‌బీవో) పోస్టులు 1,857, టీఆర్టీలోని స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ (తెలుగు మాధ్యమం) 699 పోస్టులు, గురుకులాల్లో టీజీటీ సైన్స్‌ 52 పోస్టుల చొప్పున మొత్తం 2,476 పోస్టులు భర్తీ చేశామని వాణీప్రసాద్‌  తెలిపారు. 1,857 ఎఫ్‌బీవో పోస్టులకు 1,856 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఇందులో 33 మంది ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉంచామని తెలిపారు. ఒక పోస్టుకు సరైన అర్హతలు గల అభ్యర్థి లేని కారణంగా ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. 699 స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ తెలుగు మాధ్యమం పోస్టులకు 653 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. 25 వికలాంగుల పోస్టులకు సంబంధించిన ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా 22 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 52 టీజీటీ సైన్స్‌ పోస్టులకు 52 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు.
భర్తీ చేసిన పోస్టుల వివరాలు
క్యాడర్‌ పోస్టుల   భర్తీ
ఎఫ్‌బీవో         1823
స్కూల్‌ అసిస్టెంట్‌ 653
టీజీటీ సైన్స్‌    52
మొత్తం    2,528

Related Posts