Highlights
- అంత్యక్రియలకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ రెండో sodari విమలా బాయి(82) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విమలా బాయి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబీకులు తెలిపారు. హైదరాబాద్ లోని అల్వాల్ మంగాపురం కాలనీలో విమలాబాయి నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న.