YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘రాష్ట్ర తీవ్రవాదం‘ పెచ్చుమీరిపోతుంది:నిప్పులు చెరిగిన మాయావతి

‘రాష్ట్ర తీవ్రవాదం‘ పెచ్చుమీరిపోతుంది:నిప్పులు చెరిగిన మాయావతి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో ‘రాష్ట్ర తీవ్రవాదం‘ పెచ్చుమీరిపోతుందని, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూపీలో అలీఘర్‌ విశ్వవిద్యాలయానికి(ఏఎంయూ) చెందిన 14 మంది విద్యార్థులను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేయడం, అలాగే గోహత్యకు పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్‌లో మైనార్టీలపై నేషనల్‌ సెక్యూరిటీ చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద అభియోగాలు మోపి, జైలు పాలు చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గోహత్యలకు పాల్పడిన వారిపై భాజపా దారుణమైన ఎన్‌ఎస్‌ఏ చట్టాన్ని బనాయించించి వారిని హింసించినట్లుగానే మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వమూ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఏఎంయూకు చెందిన 14 మంది విద్యార్థులను దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసింది. ఇవి రెండు రాష్ట్ర తీవ్రవాదానికి ఉదాహరణలు. వెంటనే వాటిని ఖండించాలి’ అని ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు. కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రజలు గుర్తించాలి’ అని ఆమె మండిపడ్డారు. గోహత్యకు పాల్పడ్డారని ఖాండ్వాకు చెందిన ముగ్గురు ముస్లిం యువకుల మీద  మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏ కింద కేసు పెట్టింది.

Related Posts