YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడు సీట్లు సాధించన వాళ్లు శాసిస్తున్నారు

మూడు సీట్లు సాధించన వాళ్లు శాసిస్తున్నారు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశం గురించి తమకు చాలా ఆందోళనంగా ఉందని, అందుకే, వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి తాము ఆలోచిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ అధినేత వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు గురించి ప్రశ్నించగా, తమతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఈ సంద్భంగా కేజ్రీవాల్ ప్రస్తావించారు. తమ పార్టీ 67  స్థానాల్లో విజయం సాధించినప్పటికీ అధికారాలు మాత్రం తమకు లేవని, మూడు స్థానాల్లో గెలుపొందిన వారికి అధికారాలు ఉన్నాయని విమర్శించారు. ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం?ఢిల్లీ ప్రభుత్వానికి ఎందుకు అధికారాలు లేవు? అని ప్రశ్నించారు. ఢిల్లీకి అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వానికి అధికారులను బదిలీ చేసే అవకాశం కూడా లేకపోతే పరిపాలన ఎలా చేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా సాగుతున్న ఢిల్లీ ప్రభుత్వ పాలనకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Related Posts