YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

శాంసంగ్, షావోమి మధ్య కథ రసవత్తరం

శాంసంగ్, షావోమి మధ్య కథ రసవత్తరం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మరీముఖ్యంగా శాంసంగ్, షావోమి మధ్య కథ రసవత్తరంగా మారింది. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకప్పుడు శాంసంగ్ కింగ్. కానీ ఇప్పుడు షావోమి ఆ స్థానాన్ని ఆక్రమించింది. దీంతో ఇరు కంపెనీల మధ్య పోటీ గట్టిగానే ఉంది. శాంసంగ్, షావోమి కంపెనీలు ఫిబ్రవరి 20న ఢీ అంటే ఢీ అని తలబడబోతున్నాయి. అందేంటని అనుకుంటున్నారా? ఆ రోజున బీజింగ్‌లో షావోమి ఎంఐ9 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించడానికి సిద్ధమౌతోంది. మరోవైపు అదేరోజున శాన్‌ఫ్రాన్సిస్కోలో శాంసంగ్ తన గెలాక్సీ ఎస్10 సిరీస్‌ను ఆవిష్కరించబోతోంది. తమ నుంచి ఇప్పటి దాకా మార్కెట్‌లోకి వచ్చిన మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లోకెల్లా ఎంఐ9 బెస్ట్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్ అని షావోమి చెబుతోంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 27 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, ఎంఐయూఐ 10, ఆండ్రాయిడ్ 9 పై వంటి ఫీచర్లు ఉండొచ్చు. అలాగే 6.4 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలకు అవకాశముంది. షావోమి ఎంఐ9 ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+ 12 ఎంపీ + 3డీ టీఎఫ్‌వో సెన్సర్), 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉండొచ్చు. ఫోన్ ప్రోమో ఫోటోలో కూడా ట్రిపుల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంఐ9 ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్, గోల్డ్ రంగుల్లో లభ్యంకావొచ్చు. ఇది 8 జీబీ ర్యామ్+28 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్+256 మెమరీ, 6 జీబీ ర్యామ్+128 జీబీ మెమరీ వేరియంట్ల రూపంలో అందుబాటులోకి రావొచ్చు. 

Related Posts