YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ ను ఆప్యాయంగా ముద్దాడిన ఓ మహిళ

రాహుల్ ను ఆప్యాయంగా ముద్దాడిన ఓ మహిళ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

గుజరాత్ లోని వల్సాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు కొందరు మహిళలు వచ్చారు. తన వద్దకు వస్తున్న వారిని చూసి రాహుల్ లేచి నిల్చున్నారు. ఇంతలో ఓ మహిళ రాహుల్ ను దగ్గరకు లాగి, అతని బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత కూడా ఆయన గడ్డాన్ని పట్టుకుని ఆప్యాయతను కురిపించింది. ఈ సందర్భంగా, రాహుల్ కూడా నవ్వుతూ ఉండిపోయారు
ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అనీ, దాన్ని పాటించవద్దని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ హిందూ సంఘాలు చెబుతుంటాయి. ప్రేమికుల రోజు సందర్భంగా పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేసేస్తామని హెచ్చరిస్తూ ఉంటాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ సభ్యులు  పెళ్లి చేశారు.పార్కులో తచ్చాడుతున్న ప్రేమ జంటను చుట్టుముట్టిన సభ్యులు అబ్బాయి చేత యువతికి తాళి కట్టించారు. ఈరోజు చాలా మంచిదనీ, ఆమెకు తాళి కట్టాలని సూచించారు. దీంతో సదరు యువకుడు బిక్కుబిక్కుమంటూ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు.ఈ తతంగాన్ని భజరంగ్ దళ్ సభ్యులు వీడియో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కుల వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు

Related Posts