Highlights
- వటపత్రశాయి అలంకారసేవ
- శ్రీవారు శ్రీకృష్ణుని అలంకారం
- తిరువీధుల్లో కనువిందు
యాదాద్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. జ్వాలానారసింహుడు మంగళవారం మురళీమనోహరునిగా దర్శనమిచ్చారు. రాత్రి బ్రహ్మ వాహనమైన హంసపై శ్రీలక్ష్మీనాథుడు బాలాలయంలో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ్రీవారు శ్రీకృష్ణుని అలంకారంలో తిరువీధుల్లో కనువిందు చేశారు. ఆ దృశ్యాల్ని తిలకించిన భక్తులు తన్మయత్వంతో మానస సంచరరే.. అంటూ పాడుకుంటూ ఆనందంతో అడుగులు వేస్తూ తిరువీధి సేవలో మమేకమయ్యారు. బ్రహ్మమానస అధిష్ఠానమైన హంస వాహనమును ఎందరో మహర్షులు స్తుతించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు వటపత్రశాయి అలంకారసేవలో దర్శనమిస్తారు. రాత్రి 9 గంటలకు పొన్నవాహనంపై బాలాలయంలో విహరిస్తారు.