YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందుకు సాగని ఇంటి పనులు

ముందుకు సాగని ఇంటి పనులు

కదిరి మున్సిపాల్టీకి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేసిన వెయ్యి ఇళ్ల లక్ష్యాన్ని సాధించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మున్సిపాల్టీకి వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తూ 2016 అంబేద్కర్ జయంతి రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ, ఏడాదిలోగా వెయ్యి ఇళ్లు పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చాయి. అయితే మొదట ప్రభుత్వ నిబంధనలు కష్టసాధ్యంగా వుండడంతో చాలామంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనా వారు కట్టుకునేందుకు ముందుకు రాలేదు. సొంత స్థలాల్లో వున్న లబ్ధిదారులు మొదట మున్సిపల్ అధికారులచే ప్లానింగ్ తీసుకోవాలని చెప్పడంతో వేలాది రూపాయలు చెల్లించి ప్లాన్‌ను తీసుకొని టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందజేశారు. కొంతమంది మాత్రం వారి స్థలాలకు సంబంధించిన ఈసీని జత చేయాలని కోరడంతో ప్రభుత్వ పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇబ్బందులుపడ్డారు. దీంతో వెయ్యి ఇళ్ల లక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయగా, కేవలం 435 మంది లబ్ధిదారులు మాత్రమే ముందుకు రాగా, వారిలో 320 మంది ఇళ్లను పూర్తి చేశారు. ముఖ్యంగా మున్సిపాల్టీ సరిహద్దులో వున్న వారు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు మున్సిపల్ అధికారులు ప్లానింగ్ ఇవ్వకపోవడంతో చాలామంది స్థలం ఉన్నప్పటికీ ఇళ్లు కట్టుకోలేక ఏళ్లతరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నిబంధనలను కొంతవరకు సడలిస్తూ మున్సిపల్ సరిహద్దులో వున్న వారికి కూడా పక్కా ఇళ్లు కట్టుకునేందుకు అర్హులని జీఓను జారీ చేస్తూ హౌసింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పక్కా గృహాలకు ఎంపికైన 680 ఇళ్ల లబ్ధిదారుల్లో 200 మందిని మున్సిపల్ అధికారులు ఎంపిక చేసి కలెక్టర్ ఆమోదానికి పంపడంతో అక్కడి నుండి అనుమతి కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా చాలామంది లబ్ధిదారులు పక్కా గృహాల నిర్మాణానికి ముందుకొస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల వల్ల ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాకపోవడం విశేషం. నత్తనడకగా సాగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణం గురించి హౌసింగ్ డీఈ అశోక్‌ను వివరణ కోరగా ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణానికి కొంతవరకు నిబంధనలు సడలించడంతో 200 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తూ జిల్లా కలెక్టర్‌కు జాబితాను పంపామని, రాగానే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, వెయ్యి ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా చూసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.

Related Posts