Highlights
- తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు పోటీ
- ఆంధ్రాలో 25,
- తెలంగాణలో 25 లకు
- తెలంగాణా ఎన్నికల కన్వీనర్ దుర్గారాణి
- ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కన్వీనర్ సుసర్ల వసుధ
- భారత బ్రాహ్మణ సంస్థాన్. అధ్యక్షుడు గిరి ప్రసాద్ శర్మ వెల్లడి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సర్వం సన్నద్ధమవుతున్నట్టు భారత బ్రాహ్మణ సంస్థాన్. అధ్యక్షుడు గిరి ప్రసాద్ శర్మ వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమ బలాబలాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామన్నారు. ఈ ఉభయ రాష్ట్రాల్లో కలిపి 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆంధ్రాలో 25, తెలంగాణలో 25 అసెంబ్లీ స్థానాల్లో బ్రాహ్మణ మహిళలను స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్ట బోతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో మిగిలిన పార్టీలు బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తాయి, ఇంకా ప్రజలను మభ్య పెట్టె మాటలు మాట్లాడి మళ్ళీ మళ్ళీ వంచిస్తారు తమకు మాత్రం కమిటీల ఎంపిక ప్రక్రియలో పెద్ద అవసరం కూడా లేదని స్పష్టం చేసారు. ప్రజలు కోరుకుంటే కమిటీల ప్రమేయం లేకుండా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో kanisam 2 నియోజకవర్గాఆ చొప్పున బలపడినా, అధికారంలో ఉన్న ప్రభుత్వాల ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి గట్టి సపోర్ట్ తీసుకుంటామన్నారు. మేము ఎవరికీ పోటీగా నిలబడము, పోటీ చేస్తామని చెప్పి, అందుకు భిన్నంగా వ్యవహరించే పద్దతి తమకు లేదు. ముందుగానే సమాచార సాంకేతిక పరిజ్ఞానం, దిశ-దశను ఇచ్చే యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని సమకూర్చుకున్నాము, ప్రధానంగా బ్రాహ్మణ యువజన విభాగాలు, మహిళా విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో ముందుకు సాగేందుకు కొద్ది మంది నిపుణులతో ఇప్పటికే తాము చర్చలు ప్రారంభించామని, అదే విధంగా జాతీయ సమస్యలు, రైతాంగ సమస్యలు, కుల-మత సంబంధ అంశాలు, వివిధ సంక్షేమ పథకాలు, మరో పక్క స్థానిక సమస్యలను గుర్తించడం, ప్రజల సహకారంతో పరిష్కరించడం, లేకుంటే వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఎన్నికలు సమయం ఆసన్నం కావడంతో ప్రజల వద్దకు పార్టీ విధానాలతో చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఇందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణా ఎన్నికల విభాగానికి దుర్గా రాణి , ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల విభాగానికి సుసర్ల వసుధ గారిని వర్కింగ్ కమిటీ కన్వీనర్లుగా నిర్ణయించామని తెలిపారు. త్వరలో 25 మంది తెలంగాణా , 25 మంది ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ స్వతంత్ర అభ్యర్థులను ప్రకటించి ప్రజల ముందుకు వెళ్తామన్నారు.