YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

భారీగా పెరగనున్న డిగ్రీ కోర్సుల ఫీజులు

భారీగా పెరగనున్న డిగ్రీ కోర్సుల ఫీజులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

డిగ్రీ కోర్సుల ఫీజులు పెంచేందుకు యూనివర్సిటీలు సిద్దమవుతున్నాయి. అ యితే పెరగనున్న ఫీజులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మా త్రం వర్తించదు. పెరిగిన ఫీజుల భారాన్ని విద్యార్థులే భ రించాల్సి ఉంటుంది. ఈ మేరకు వర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 201920 విద్యాసంవత్సరం నుంచి పెరిగిన ఫీజులు అమలులోకి రానున్నాయి. పెరిగిన కళాశాల నిర్వహణ వ్యయానికి అనుగుణంగా ఫీజులు పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా కామన్ ఫీజు విధానం తీసుకురావాలని గత కొంతకాలంగా ప్రైవేట్ యాజమాన్యాలు విద్యాశాఖను కోరుతున్నాయి.ఈ మేరకు ఫీజులు పెంచేందుకు వర్సిటీలు సిద్దమవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఒక్కో కోర్సు పై సుమారుగా రూ. 5 వేల నుంచి రూ.7 వేల వరకు ఫీజులు పెరగనున్నాయి. వాటితోపాటు అన్ని వర్సిటీలు ప్రతి కోర్సుకు ఒకే విధంగా ఫీజు నిర్ణయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కామన్ ఫీజు విధానం ఎలాంటి విధానపరమైన నిర్ణయం లేకపోయినప్పటికీ రాష్ట్రంలో కామన్ ఫీజు విధానం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెరగనున్న డిగ్రీ కోర్సుల ఫీజులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించకపోతే విద్యార్థులపై ఆ భారం విద్యార్థులపైనే పడనుంది. గతంలో కూడా ఫీజులు పెంచినా ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రం పెరగలేదు. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులకు ఫీజులు పెరిగిన ప్రతిసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా పెరుగుతుంది. డిగ్రీ కోర్సులకు మాత్రం ఆ ఫీజులు పెరిగినా, రీయింబర్స్‌మెంట్ మాత్రం వర్తించడం లేదు. దాం తో ఆర్థికంగా వెనుకబడి డిగ్రీ చదువుకోవాలనుకు నే విద్యార్థులకు ఫీజులు పెరిగితే ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

Related Posts