యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్ఫిఎఫ్ జవాన్ల పై జరిగిన దాడి నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంచలన ప్రకటన చేశారు. మన పొరుగున ఉన్న టెర్రరిస్టు దేశమైన పాకిస్థాన్కు ‘మోస్ట్ ఫ్యావర్డ్ నేషన్’ (ఎంఎఫ్ఎన్) హోదాను విత్ డ్రా చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. పుల్వామాలో తీవ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ జవాన్లు మరణించిన నేపథ్యంలో ‘అత్యంత అభిమాన దేశం’ హోదాను ఉపసంహరించుకున్నట్లు అయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన భద్రతపై జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం జైట్లీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘అత్యంత అభిమాన దేశం’ హోదా వల్ల అంతర్జాతీయ వర్తకంలో ఆయా దేశాలకు కొన్ని హక్కులుంటాయి. పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉన్న నేపథ్యంలో ఆ దేశాన్ని దౌత్యపరంగా ప్రపంచంలోనే ఒంటరిని చేయాలని జైట్లీ కోరారు.