YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమర జవాన్లు అండగా ఉంటాం :మోడీ

అమర జవాన్లు అండగా ఉంటాం :మోడీ
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఢిల్లీలో శుక్రవారం ఆయన నివాళులర్పించారు. అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, జవాన్ల సాహసంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మోదీ. భారత్‌లో అస్థిరత్వం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సాగనివ్వబోమని హెచ్చరించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న పాకిస్థాన్‌పైనా ప్రతీకారం తీర్చుకునే తీరతామన్నారు. జవాన్లపై జరిగిన దాడితో 130 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోతోందని.. దానికి దీటైన సమాధానం చెబుతామన్నారు. ఉగ్రవాదంపై మానవాళి అంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు. మన సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. అమరుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు పాల్పడకుండా అందరూ కలిసి పోరాడాలని మోదీ పిలుపునిచ్చారు

Related Posts