యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్మూ సిటీలో కర్ఫ్యూ విధించారు. పుల్వామా దాడికి వ్యతిరేకంగా అక్కడ బంద్ పాటించారు. ఆ బంద్‌లో ఆందోళనకారులు వాహనాలను తగులబెట్టారు. హింసలో సుమారు 12 మంది గాయపడ్డారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దించారు. జమ్మూ సిటీలో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ చేస్తోంది. మతఘర్షణలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. సిటీలో కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు వెళ్లిపోవాంటూ జమ్మూ ఓల్డ్ సిటీలో పోలీసులు ప్రకటన చేసినా.. వాళ్లు వెళ్లేందుకు నిరాకరించారు. అధికారుల సమాచారం ప్రకారం జమ్మూ సిటీలో బంద్ సంపూర్ణంగా జరిగింది. రోడ్లపై ట్రాఫిక్ కనిపించలేదు. షాపులు, మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. పాక్‌కు వ్యతిరేకంగా జమ్మూ సిటీలో నినాదాలు మారుమోగాయి. అనేక వీధుల్లో జనం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జవల్ చౌక్, పురానీ ముండి, రేహరి, శక్తినగర్, పక్కా డంగా, జానిపుర్, గాంధీనగర్, బాక్షీనగర్ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి