Highlights
- గ్రీన్ కోర్టు ఆదేశాలు
- సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుకు ఆదేశాలు
- ఎస్‌టీపీ నిర్మిస్తేనే మళ్లీ తెరవచ్చు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హజ్ హౌజ్‌ను మూసివేశారు. నేషనల్ గ్రీన్ కోర్టు ఆదేశాల మేరకు హజ్ హౌజ్‌ను సీజ్ చేశారు.హజ్ హౌజ్‌లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లేకపోవడం వల్ల హిందన్ నది కలుషితమవుతుందని కోర్టు పేర్కొన్నది. దాని వల్ల సమీపంలో ఉన్న భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. దీనితో గ్రీన్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నది. హజ్ హౌజ్‌లో ప్రతి రోజు వచ్చే 136 కిలోలీటర్ల వ్యర్థాలను శుద్ధి చేయడానికి సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గ్రీన్ కోర్టు ఉత్తరప్రదేశ్ హజ్ హౌజ్‌ను ఆదేశించింది. ఎస్‌టీపీ నిర్మిస్తేనే, హజ్ హౌజ్‌ను మళ్లీ తెరుస్తామని అధికారులు తెలిపారు.