యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సైనికులపై దాడికి ప్లాన్ గత సంవత్సరం పాకిస్థాన్ కరాచీలోనే జరిగినట్లు ఇంటలిజెన్స్ తేల్చి చెప్పింది. గతంలో జరిగిన దాడుల్లాగే ఈ దాడిలోనూ భారీగా పేలుడు పదార్థాలు ఉపయోగిం చడం సంచలనం కలిగిస్తోంది.జమ్మూకశ్మీర్ పూల్వామా అవంతీపోరాలోని గిరిపోరా ప్రాంతం లో జరిగిన ఉగ్రదాడిలో 45 మంది భారత జవాన్లు అమరులయ్యా రు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి జైష్-ఏ- మహమ్మద్ ఉగ్రసంస్థ బాధ్యతను వహిస్తూ వీడియోను కూడా రిలీజ్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఉగ్రనాయకుడు అబ్దుల్ రషీద్ ఘజీ ఈ దాడికి ప్రణాళిక రచించాడు. దాడికి అదిల్ అహ్మద్ డర్ అనే యువకుడిని ఎంచుకొని ఎల్‌ఈడీ బ్లాస్టింగ్‌లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఘజీ డిసెంబర్‌లో కశ్మీర్‌లో చొరబడ్డాడు.ఈ విషయంపై ఇంటలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. పాకిస్థాన్ కరాచీలో 2018 5వ తేదీన జైష్ జరిపిన ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ దాడికి ప్రణాళిక అక్కడే రచించారు. దాడులకు పాల్పడేందుకు ఏడు టీమ్‌లు కూడా అక్కడి నుంచే బయల్దేరాయి. కరాచీ ర్యాలీలో ఉగ్రవాది మసూద్ అజర్ చిన్నత మ్ముడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ భారత్‌లో దాడులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఘజీ కశ్మీర్‌లో చొరబడగానే ఇంటలిజెన్స్ వర్గాలు భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. ఘజీ చొరబడ్డాక ఉగ్రకార్యకలాపాలు పెరిగాయి.ఎన్నికల నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రాజకీయ ప్రముఖులను ఉగ్రమూకలు టార్గెట్ చేశాయని వెల్లడించాయి. జైష్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ. దీని లక్ష్యం కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయడం. ఈ సంస్థను మౌలానా మసూద్ అజర్ స్థాపించాడు. ప్రస్తుతం అతని తమ్ముడు మౌలానా రవూఫ్ అస్గర్ ఈ సంస్థకు నాయకుడు. భారత్, అమెరికా, బ్రిటన్‌లు జారీ చేసిన ఉగ్రవాద సంస్థ జైష్