YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

ప్రపంచ కప్ నుంచి భారత్ నిష్క్రమణ..??

ప్రపంచ కప్ నుంచి భారత్ నిష్క్రమణ..??

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:


 ఫస్ట్ ఇన్ న్యూస్: దేశ సరిహద్దుల్లో మనకు రక్షణ కవచాలు గా.. తమదేహం..హృదయం..ప్రాణం తో "కంచె" వేసి కావలి కాస్తున్న మన వీర జవాన్లు మనం అభిమానించే నేత కన్నా, ఆదరించే హీరో కన్నా గొప్పవారు.. జన్మనిచ్చిన అమ్మ కన్నా..పెంచి పెద్ద చేసిన నాన్న కన్నా.. బతుకు పంచిన భార్య కన్నా..కన్న బిడ్డల భవిష్యత్తు కన్నా అమ్మ పిలుస్తున్నా..భార్య తలుస్తున్నా...కలలో కన్న బిడ్డల కేరింతలు కళకళలాడుతున్నా.. తన  హృదయంతరాల్లో వాటిని బలవంతంగా అణచి వేస్తూ.. నూటికి నూరు శాతం తమ ప్రాణ త్యాగాలు ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వారే మన అమర జవాన్లు.
     మరి దేశాన్ని వారి కన్నా బిడ్డలా కాచుకునే సైనికులు ముష్కర దాడిలో మాంసపు ముక్కలుగా రక్తపు మడుగులో చెల్లా చెదురుగా పడి ఉంటే..  భరత మాత ఎంతగా రోదించి ఉంటుందో ఊహాజనితం. ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. ఈ దాడిలో పాక్ హస్తం ఉన్న నేపథ్యంలో ఆ దేశాన్ని దౌత్యపరంగా ప్రపంచంలోనే ఒంటరిని చేయాలి. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరు సహాయం చేయాలి. ప్రతి రంగం వారు ముందుకి రావాలి .. సినీ ఇండస్ట్రీలో పాకిస్తాన్ సింగర్లను, నటులను బహిష్కరించాలి.  అదే విధంగా మరి కొన్ని రోజులలో ఇంగ్లాండ్ లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ని బహిష్కరించాలని ఐసీసీ మీద ఒత్తిడి తీసుకురావాలి. లేకపోతే మన టీమ్ ఇండియా టోర్నీ ఆడడం మానేయాలి. దీనిపై మన క్రికెటబోర్డు బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవాలి. దీనికి భారత ఆటగాళ్లు కూడా సహకరించి టోర్నీ నుంచి నిష్క్రమించాలి..  జై జవాన్ మాటకి అర్ధం..జవాన్ కి జై కొట్టడం కాదు..జవాన్ లేని దేశం లేదని తెలుసుకుందాం. అమరులైన వారి ఆత్మలకు జై కొడదాం.. ఇంత ఘోరం జరిగినా మొక్కవోని ధైర్యంతో మరింత అంకిత భావంతో.. తమ సహచరులని ఊచకోత కోసిన ముష్కరుల పై మరింత కసితో ముందుకు ఉరుకుతున్న వీర సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపుదాం.. మన సైనికులు కుటుంబాలకు అండగా ఉందాం, మన జవానులకు ఆత్మ శాంతి కలుగ చేదాం. జైహింద్...

Related Posts