YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెండు గంటలు ఉచిత విధ్యుత్ పెంచిన ఏపీ ప్రభుత్వం

 రెండు గంటలు ఉచిత విధ్యుత్ పెంచిన ఏపీ  ప్రభుత్వం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్ శాఖ ముఖ్య కార్య దర్శి అజయ్జైన్ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు
ఎన్నికల వేళ..టిడిపి ప్రభుత్వం దీని అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏడు గంటల ఉచిత విద్యుత్ ను 9 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి ప్రక టన చేసారు. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసారు. అయితే, ఈ ఉత్తర్వుల్లో ఈ నిర్ణయం ఎప్పటి నుండి అమలయ్యేదీ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే అన్నదాత సుభీభవ పేరుతో కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి పదివేలు చొప్పున ఇవ్వా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే, రైతులకు పోస్ట్ డేట్ చెక్కులు ఇవ్వాలని భావించినా..అది ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అనే మీమాంస ప్రభుత్వంలో కనిపి స్తోంది. దీంతో..దీని పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఎంబీసిలకు వంద యూనిట్లు ఉచితం..
ఏపిలోని దారిద్రరేఖకు దిగువన ఉండే అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ)కు చెందిన కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ఆమోదం తెలుపుతూ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. రజకుల లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకు, నగల తయారీ వృత్తిదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను బీసీ సంక్షేమ శాఖ విద్యుత్ శాఖకు చెల్లించా ల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఇది కూడా గతంలో ఇచ్చిన హామీ అయినా..ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవటం పై చర్చ జరుగుతోంది.

Related Posts