Highlights
- వికె. జైన్ ను ప్రశ్నించిన పోలీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సలహాదారుని పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు. మహారాణి బాగ్‌లోని వికె. జైన్‌ను ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని, అనంతరం విడుదల చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ అధికారి అన్షు ప్రకాష్‌పై కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంఎల్‌ఎలు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదును స్వీకరించన పోలీసులు మంగళవారం ఆప్ ఎంఎల్‌ఎ ప్రకాష్ జర్వాల్‌ను అరెస్టు చేశారు. కాగా గతేడాది జైన్ ఐఎస్ ఆఫీసర్‌గా పదవీవిరమణ చేసిన అనంతరం కేజ్రీవాల్ సలహాదారుగా నియమితులయ్యారు