YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉగ్రవాదంపై ఉక్కు పాదం..కేంద్రానికి విపక్షాల మద్దతు

ఉగ్రవాదంపై ఉక్కు పాదం..కేంద్రానికి విపక్షాల మద్దతు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పుల్వామా దాడిపై పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం వెంటే ఉండాలని  విపక్షాలు  నిర్ణయించాయి. శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తూ అఖిలపక్షం తీర్మానించింది. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ప్రభుత్వం ఏం చేసినా తామంతా వెన్నంటే ఉంటామంటూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి హామీ ఇచ్చాయి.
భేటీ తరువాత పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ  ఉగ్రవాదంపై తీసుకునే చర్యలకు అన్ని పార్టీలూ మద్దతిచ్చాయని అన్నారు. జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులకు సహకరిస్తున్నవారంతా దేశ ద్రోహులేనన్నారు. ఉగ్రవాదం నుంచి జమ్మూ-కశ్మీర్కు విముక్తి కల్పిస్తామని తెలిపారు. పుల్వామా ఘటనలో జవాన్ల త్యాగం ఊరికే పోదని అన్నారు. దేశ‌భ‌ద్రత కోసం ప్ర‌భుత్వంతో క‌లిసి ఐక్యంగా నిలిచి ఉన్నామ‌ని కాంగ్రెస్ నేత గులామ్ న‌బీ ఆజాద్ అన్నారు. క‌శ్మీర్ అయినా లేక ఇతర ప్రాంత‌మైనా, ఉగ్ర‌దాడిని ఖండిస్తున్నామ‌ని తెలిపారు. ఉగ్ర‌పోరాటంపై ప్ర‌భుత్వానికి కాంగ్రెస్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో ప్ర‌ధాని స‌మావేశం కావాల‌ని రాజ్‌నాథ్‌ను కోరిన‌ట్లు గులాం న‌బీ ఆజాద్ తెలిపారు. అన్ని పార్టీలు ఈ అభిప్రాయానికి మ‌ద్దుతు ఇచ్చాయ‌న్నారు. యావ‌త్ దేశం ఆగ్ర‌హంగా ఉంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లంతా భ‌ద్ర‌తా ద‌ళాల‌కు అండ‌గా ఉన్నార‌న్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, శివసేన నేతలు, బీఎస్పీ, తృణమూల్, ఆర్ఎల్డీ, ఎన్సీపీ, అకాళీదల్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.  టీఆర్ఎస్ నుంచి ఎంపీ జితేందర్రెడ్డి, టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్నాయుడు సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts