YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిద్ధూను ఆడుకుంటున్న నెట్ జన్లు

 సిద్ధూను ఆడుకుంటున్న నెట్ జన్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతావని ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం తెలిసిందే. కన్నబిడ్డలను కోల్పోయి భరతమాత కంటతడి పెడుతోంది. పాక్ దుశ్చర్యలను ఇక ఎంతమాత్రం సహించేది లేదని, దాయాది దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. అమర జవాన్లకు నివాళి అర్పిస్తున్నారు. కానీ, కొంత మంది దుర్మార్గులు మాత్రం ‘పాకిస్థాన్ జిందాబాద్’, ‘పాక్ ఆర్మీ జిందాబాద్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దాయాది దేశానికి అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై యాంకర్ రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు మద్దతుగా మాట్లాడిన వారిని ఏకిపారేసింది. మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధును కూడా వదలిపెట్టలేదు. పుల్వామా దాడి అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూపై రష్మీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘దేశ విభజన సమయంలోనే ఆయన పాక్‌ వైపునకు వెళ్ళాల్సిందని.. కానీ, మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడని’ మండిపడింది. పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ షోయబ్‌ హఫీజ్‌ అనే నెటిజన్‌ చేసిన కామెంట్‌కు రష్మీ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘సాలె.. నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? మాతోనే మీ అస్థిత్వం.. లేకపోతే మీరు మట్టితో సమానం.. పాక్‌లోని చాలా ప్రాంతాలను నేటికీ మా నాయకుల పేర్లతో పిలుస్తున్నారు. శాంతికాముకులం కాబట్టే నీ లాంటి బచ్చాగాళ్లను క్షమిస్తూ వస్తున్నాం.. ఇప్పటికైనా మూసుకుని కూర్చో’ అంటూ నిప్పులు చెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ స్టూడెంట్ చేసిన కామెంట్‌పై కూడా యాంకర్ రష్మీ ఘాటుగానే బదులిచ్చింది. ‘ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఈ నా కొడుకులను ఏరి పారెయ్యాలి..’ అంటూ మండిపడింది. ‘పాకిస్థాన్ వెళ్లిపో..’ అంటూ మరో నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పుల్వామా దాడి అంశంలో విషం కక్కిన పాక్ మీడియాను ఆమె వదల్లేదు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ఓ ఉగ్రవాది చేసిన పనికి యావత్ దేశాన్ని నిందించడం సరికాదన్నారు. పాక్‌ను తప్పుబట్టడం సరికాదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు దొరికాయి. దాయాది దేశంతో భారత్‌ చర్చలు జరిపితేగానీ ఇలాంటి ఘటనలు ఆగవని సిద్ధూ వ్యాఖ్యానించారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం లాంటి చర్యలతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. 

Related Posts