రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రిమోట్ ద్వారా ముక్త్యాల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేస్తున్నాం. 15 సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాలను మంజూరు చేస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే గురుకులాల లక్ష్యం. అట్టడుగు వర్గాల పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ గురుకుల విద్యాలయాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 188 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఏటా 1,12,000 మంది విద్యార్ధులకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్నాం. మీరంతా మట్టిలో మాణిక్యాలు, అవకాశాలు ఇస్తే మీరు ఎంతవరకైనా ఎదగగలుగుతారు. కొత్తగా మరో 15 గురుకులాలు మంజూరు చేశాం. వీటికి నూతన భవనాలు కూడా నిర్మిస్తున్నాం. వీటిద్వారా సుమారు మరో 14,200 మందికి ప్రవేశం కల్పిస్తాం.
ఒక్కో పాఠశాల నిర్మాణానికి 33.5 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం రూ.502 కోట్లు ఈ నూతన విద్యాలయాల నిర్మాణానికి కేటాయించాం. ప్రతి విద్యాలయంలో పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియం, డిజిటల్, వర్చువల్ తరగతులు ప్రవేశపెడుతున్నాం. పదో తరగతి పరీక్షల్లో గత విద్యాసంవత్సరం కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా 95 శాతం ఉతీర్ణత. ఈ విద్యా సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యమని అయన అన్నారు.
2017-18 విద్యా సంవత్సరంలో నీట్ లో 150మంది, ఐఐటీలో 82 మంది అర్హత సాధించారు, ఇది గర్వకారణం. ఎంబీబీఎస్ లో 10 మంది, బీడీఎస్ లో ఇద్దరు చేరారు. ‘వరల్డ్ మేకర్ ఫెయిర్’ న్యూయార్క్కు 11 మంది ఎంపికయ్యారు. హిందీ ప్రాధమిక, మధ్యమ, రాష్ట్ర బాషా పరీక్షలకు హాజరైన 15010 విద్యార్ధుల నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. జపనీస్ లాంగ్వేజ్లో 5 గురు విద్యార్ధుల ఉత్తీర్ణత పొందారు. విద్యతో పాటురాష్ట్ర వాప్తంగా 22 వేల మంది విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్, 10 వేల మందికి వృత్తి విద్యలో శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు.
ప్రతి విద్యార్ధికి నైపుణ్య వికాసం ద్వారా ఐటీ , కమ్యునికేషన్ ఇంగ్లీష్లలో ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం.
అంతర్జాతీయ కరాటే చాంపియన్షిప్ అండర్ 12 విభాగంలో తాడేపల్లిగూడెం గురుకుల విద్యార్ధి గౌరవ్ శ్యాం దీపక్ బంగారు పతకం సాధించాడు. గడిచిన రెండేళ్లలో 14 మంది గురుకుల విద్యార్ధులు ఎవరెస్టు అధిరోహించారు. కోలాటం, కూచిపూడి, అంబేత్కర్ నృత్య రూపకం విభాగాల్లో మూడు గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. ఇండియా బుక్ అఫ్ రికార్డ్, 6 తెలుగు బుక్ అఫ్ రికార్డులు సాధించారు. ప్రపంచ మెమరీ చాంపియన్షిప్ కు నలుగురు విద్యార్ధుల ఎంపికయ్యారు. జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్ లో రెండు కాంస్య పతకాలు సాధించారు. పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నాం. పుస్తకాలు, యూనిఫారంతోపాటు పాదరక్షలు, సబ్బు, దువ్వెన, పేస్టు ఇస్తున్నాం. ఇవన్నీ విద్యార్ధులకు సరిగా అందేలా సాంకేతికత ఉపయోగించి అన్నపూర్ణ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సమర్థులైన ఉపాధ్యాయులతో బోధన, మెరుగైన వసతి సౌకర్యాలు, మంచి పౌష్టికాహారం, ఆటపాటల్లో శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడేలా గురుకులాల్లో కార్పొరేట్ సంస్థలను మించిన ఏర్పాట్లు చేశామని అన్నారు. అంబేద్కర్ జీవితాన్నే ఆదర్శంగా తీసుకోండి. పుట్టుక మన చేతిలో లేదు, కానీ మన భవిత మన చేతిలో ఉందని అంబేద్కర్ చెప్పారని అయన గుర్తు చేసారు..