YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ రోజు నుంచి తెదేపా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

 ఈ రోజు  నుంచి  తెదేపా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటం తో  ఈ నెల 17 నుండి ప్రచారాన్ని ప్రారంభించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.సమావేశానంతరం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపటినుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంబించ బోతున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రకటనకు ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో సమర్థత, పనితీరుకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై నేతలు చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై సమీక్షించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వెళ్లే అంశంపై సమీక్షించారు. నేతల వలసలు, చేరికపై కూడా చర్చించారు..తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెదేపాకు ప్రజల మద్దతు చాలా బాగుందన్నారు. సీట్ల సర్దుబాటులో విబేధాల వల్లే కొందరు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు తెదేపాను వీడిన నాయకులు నష్టపోతారని పేర్కొన్నారు. అవసరం తీరాక పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. కులం పేరుతో కొందరు తెదేపాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కాలవ శ్రీనివాసులు తెలిపారు. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కోసం మేనిఫెస్టో కమిటీ పనిచేస్తుందని వివరించారు. రైతులకు మరింత సాయం చేసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన బాధ్యతను ఆ రాష్ట్ర కమిటీకే అప్పగించినట్లు వెల్లడించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ స్థానాలను అధికంగా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆరోపించారు.పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని నేతలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Related Posts