యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంత్రి సోమిరెడ్డి, కడప నేత రామసుబ్బారెడ్డి రానున్న ఎన్నికలలో పోటీచేసేందుకుగాను ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. సుబ్బారెడ్డి జమ్మలమడుగు నుండి పోటీచేయనుండగా సోమిరెడ్డి సర్వేపల్లి నుండి పోటీకి అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ ఇద్దరి రాజీనామాలు కూడా ఆమోదం పొందాయి. కాగా ఇప్పుడు వీరిబాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరి నిర్ణయాన్ని పార్టీ పాలసీగా తీసుకుంటే మరికొన్ని ఎమ్మెల్సీ ఖాళీ కానున్నాయి. పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండగా లోకేష్ తో పాటు ఎనిమిది మంది రాజీనామా చేసే అవకాశం ఉంది.వీరిలో నారా లోకేష్, నారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కరణం బలరాం, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, పయ్యావుల కేశవ్, అన్నం సతీష్ తదితరులు ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్నారు. రాజీనామా నిరయంతో గెలుపుపై ధీమాతోనే అనే సంకేతం ప్రజలలోకి ఇవ్వడంతో పాటు అసంతృప్తులను శాంతింపజేసేందుకు అవకాశం ఉంటుందని పార్టీ ఆలోచనగా తెలుస్తుంది. నిన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాససన మండలి ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణరావును కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎమ్మెల్సీగా ఉండకూడదన్న వ్యక్తిగత నిర్ణయంతోనే రాజీనామా చేశా. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేశా. సీఎం ‘ఆలోచించావా? పునఃపరిశీలించుకో’ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను అని స్పష్టంగా చెప్పా. సీఎం సరే అన్నారు. నా తరఫున ఎవరికీ ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎంకు సూచించలేదు. పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయం. సర్వేపల్లి నుంచి నా పోటీపై కూడా తుది నిర్ణయం పార్టీదే. మంత్రి పదవిలో కొనసాగుతాను. సర్వేపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉంది.’ అని సోమిరెడ్డి అన్నారు.