YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

156 కోట్లతో 681 ఏపీఆర్టీసీ బస్సులు

156 కోట్లతో 681 ఏపీఆర్టీసీ బస్సులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మారుతున్న కాలానుగుణంగా ప్రయణీకుల అవసరాలను గుర్తించిన ఏపీఎస్‌ఆర్‌టీసీ రూ.156 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 681 బస్సులను కొనుగోలు చేస్తోంది. మూడు, నాలుగు దశల్లో ఈ బస్సులన్నీ రోడ్డెక్కబోతున్నాయి. ఇప్పటికే 210 బస్సులు రాగా వీటి పనితీరును శుక్రవారం పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ప్రాంగణంలో మీడియాకు ప్రదర్శించారు. ఇటీవలే ఏసీ బస్సుల కోవలో 84 స్లీపర్, సీటర్, స్లీపర్ కం సీటర్ బస్సులను రోడ్డెక్కించిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా రూ.20 కోట్లతో 94 తెలుగు వెలుగు బస్సులు, 13 కోట్లతో 60 అల్ట్రా తెలుగు బస్సులు, రూ.14 కోట్లతో 75 సిటీ ఆర్డినరీ బస్సులు, రూ.52 కోట్లతో 57 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు, రూ.42 కోట్లతో 170 సూపర్ లగ్జరీ బస్సులు, రూ.33 కోట్లతో 136 అల్ట్రాడీలక్స్ బస్సులు, రూ.19 కోట్లతో 89 ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేస్తున్నారు.ఈ బస్సులన్నింటా అత్యాధునిక సౌకర్యలున్నాయి. ప్రధానంగా సామాన్యులు ప్రయాణించే తెలుగు వెలుగు బస్సులో న్యూమాటిక్ డోర్లు, విశాలమైన డిక్కీ సౌకర్యం, కండక్టర్ల సింగిల్ సీటు సౌకర్యం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో డోర్‌కు రూ.25వేలు ఖర్చయింది. ఇక డ్రైవర్లు తాము కూర్చొన్న చోటు నుంచే డోర్లు వాటంతటవే మూసుకునేలా తెరచుకునేలా ఆపరేట్ చేస్తారు. తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో చివరి భాగంలో రెండు టైర్లు మధ్యలో విశాలంగా మూడు వైపులా ఖాళీ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీనివల్ల చిరు వ్యాపారులు పెద్దమొత్తంలో కూడా కార్గో రవాణాను చేసుకోవచ్చు. దీనివల్ల మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు పొందవచ్చు.

Related Posts