Highlights
రూ.20వేల కోట్లు కేటాయింపు
2.5లక్షల మందికి ఉద్యోగాలకు అవకాశం
రక్షణ రంగ సంస్థల ఏర్పాటుకు ఏపీ
డిఫెన్స్ కారిడర్ ఇవ్వాలన్న తెలంగాణలకు మంగళం
పెట్టుబడిదారుల సదస్సు-2018లో మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్ కారిడార్ నిమిత్తం రూ.20వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. యూపీ అభివృద్ధి నిమిత్తం డిఫెన్స్ కారిడార్‌ను కేటాయిస్తున్నామని, దీనివల్ల 2.5లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మోదీ చెప్పారు. యూపీలోని లక్నోలో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సు-2018లో మోదీ ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో రక్షణ రంగ సంస్థలు చాలా ఉన్నాయని, వాటికి అనుబంధంగా డిఫెన్స్ కారిడర్ ఇవ్వాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని గతంలో కోరారు. మరో వైపు కేంద్ర రక్షణ రంగ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది. కానీ కేంద్రం మాత్రం ఆ రెండు ప్రతిపాదనలను కాదని ఉత్తర ప్రదేశ్ పట్ల ఎక్కడ లేని ప్రేమను కురిపించటం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేసి బుందేల్‌ఖండ్‌కు 20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించడమేంటని కేంద్రాన్ని నిలదీస్తున్నారు.