యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: అమలాపురం లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత రవీంద్రబాబు, మీడియా ఊహించినట్టుగానే ఈ ఉదయం టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన, హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. ఆయన వైసీపీ కండువాను కప్పుకున్నారు.అంతకుముందు గడచిన రెండు రోజులుగా ఆయన అమలాపురంలో తన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ మారే విషయంలో చర్చలు సాగించారు. కాగా, వరుసగా ఎంపీలు టీడీపీకి రాజీనామా చేస్తుండటం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రెండు రోజుల క్రితం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.