Highlights
- ప్రజలకు న్యాయం చేసే పార్టీ
- లోకనాయకుడు కమల్ హాసన్
ప్రముఖ సినీ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ వూధవారం మదురైలో భారీ జనసందోహం మధ్య తన పార్టీ పేరును ప్రకటించారు. కమల్ పార్టీ పేరు మక్కల్ నీది మయ్యమ్(పీపుల్స్ జస్టిస్ పార్టీ). ప్రజలకు న్యాయం చేసే పార్టీగా కమల్ తన రాజకీయ పార్టీని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ తాను నాయకుడిని కాదని, మీలో ఒకడిని అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తన పార్టీ జెండాను కూడా కమల్ ఆవిష్కరించారు.