యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజు బంగ్లాలో అశోక్ లో మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ సోమవారం సమావేశమయ్యారు. కిషోర్ చంద్ర దేవ్ మా్ట్లాడుతూ ప్రధాని మోడి, అమిత్ షా పాలనలో ప్రజాస్వామ్యాన్ని తోక్కేసారు. లౌకిక వాదం లేకుండా సామ్యవాద సిద్దాంతాలను మరిచి పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. బీజేపీ ని ఓడించాల్సిన అవసరం ఉంది. దానికోసం తెలుగుదేశం పార్టీ సరైనది అని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఈ నెల 24వ తేదిన టిడిపి పార్టీలో లో చేరుతున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో గతం లో గెలిచాను. ప్రస్తుతం టిడిపి రాష్ట్రం లో బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. సీటు కోసమే అయితే 2014 లోనే పార్టీ మారేవాడిని. అశోక్ గజపతిరాజు కుటుంబం, మా కుటుంబం ఎప్పుడూ స్నేహితులమే. మరో సారి అశోక్ తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని అయన అన్నారు.