
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సంచనలం సృష్టించిన జ్యోతి హత్య కేసులో మిస్టరీని మంగళగిరి పోలీసులు చేధించారు. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. జ్యోతి హత్యకు స్నేహితుడు పవన్ సహకరించినట్టు గుర్తించారు. అలాగే పలువురు యువతులను కూడా శ్రీనివాస్ ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతుల నగ్న వీడియోలు తీసి...వాటిని చూపిస్తూ బ్లాక్మొయిల్ చేసినట్లు గుర్తించారు. పథకం ప్రకారమే అమరావతి టౌన్షిప్లో జ్యోతిని శ్రీనివాస్ హత్య చేశాడని, వారం ముందే శ్రీనివాస్, స్నేహితుడు పవన్ కలిసి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో జ్యోతిని శ్రీనివాస్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతి తలపై పవన్ ఇనుపరాడ్తో బలంగా కొట్టాడని, నేరం తన మీదకు రాకుండా పవన్తో తన తలపై శ్రీనివాస్ కొట్టించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.