YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

డిమాండ్‌ లేమి.. దిగొచ్చిన పసిడి ధర

Highlights

  • రూ.31,450కి చేరన పసిడి
  • వెండి ధర రూ.39,300 లు  
 డిమాండ్‌ లేమి.. దిగొచ్చిన పసిడి ధర

అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడంతో వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. నిన్న రూ.100 తగ్గిన పసిడి నేడు మరింత కిందికి దిగింది. బుధవారం రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,450కి చేరింది. డాలరు విలువ పెరగడంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పసిడి ధర భారీగా తగ్గిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక పసిడి బాటలోనే వెండి పయనించింది.
రూ.140 తగ్గడంతో కేజీ వెండి రూ.39,300గా ఉంది.
పారిశ్రామిక వర్గాలు.. నాణెల తయారీదారుల నుంచి ఆశించిన మేర డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర కూడా పతనమైనట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగాను బంగారం ధర 0.21శాతం తగ్గి ఔన్సు 1,326 డాలర్లు పలికింది. వెండి 0.18శాతం తగ్గడంతో ఔన్సు 16.39డాలర్లు పలికింది.

Related Posts