యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్రవరి 19 నుండి 25వ తేదీ వరకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆముక్తమాల్యద సప్తాహ ప్రసంగమాలిక కార్యక్రమాని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం విజయనగర సామ్రాజ్య ఆవిర్భావము, ఆముక్తమాల్యద కావ్యరచనా నేపథ్యము, ఫిబ్రవరి 20న శ్రీవిల్లిపుత్తూరు వర్ణనల ద్వారా భారతీయ గ్రామీణ వైభవము, విష్ణుచిత్తుని భక్తి, మత్స్యధ్వజ మహారాజు వృత్తాంతమును తెలియజేస్తారు. ఫిబ్రవరి 21, 22వ తేదీలలో మత్స్యధ్వజ మహారాజుకు విష్ణుచిత్తుని ప్రభోధములు, ఫిబ్రవరి 23న యామునాచార్యుని వృత్తాంతము, రాజనీతి, శ్రీరంగయాత్రను వివరిస్తారు. ఫిబ్రవరి 24న గోదాదేవి చరిత్రము, దాసరి మంగళకైశికీ రాగాలాపన, సోమశర్మ వృత్తాంతము, ఫిబ్రవరి 25న గోదా శ్రీ రంగనాథుల కళ్యాణ వైభవమును గూర్చి ప్రభోధాత్మక సందేశములు ఇవ్యనున్నారు.