యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీకాకుళం జిల్లాలో పత్తిరైతు రుణ ఊబిలో మునిగిపోతున్నారు.. కనీసం రైతుకు పెట్టుబడులు కూడా దక్కట్టంలేదు... కౌలు చెల్లించడానికీ ఎన్నో అవస్థలు పడుతున్నాడు.. చివరకు అప్పులు చేసిమరీ చెల్లింస్తున్నారు.. చివరి దశలో అయినా మేలు జరుగుతుందని ఆశించిన పత్తి రైతులకు పురుగు, వరుస వర్షాలు కురవడంతో తీరని కష్టాలే మిగిలాయి. ఖరీఫ్ సాగులో పత్తి రైతు రుణగ్రస్తుడిలా మిగిలాడు. పెట్టుబడులు దక్కక కొందరు కౌలు కట్టడానికి అప్పులు వెదుక్కుంటున్నారు. అవీ దొరకని వారు ప్రామిసరీ నోట్లు రాస్తున్నారు. మొదట్లో ధర తక్కువ కారణంగా నష్ట పోయిన రైతులు, చివర్లో కూడా మిగులు కన్పించకపోవడంతో పొలంలో పంటను వదిలేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దిగుబడులు అంత ఘనంగా లేని పరిస్థితి నెలకొంది. 2016 ఖరీఫ్‌లో ఎకరాకు 6.86 క్వింటాళ్లు వస్తే.. 2017 ఖరీఫ్‌లో 7.02 క్వింటాళ్లకు చేరినట్లు పంటకోత ప్రయోగాల్లో తేలింది. ఇతర జిల్లాల్లో ఎకరాకు 8.21 క్వింటాళ్లు దిగుబడులు రాగా.. శ్రీకాకుళంలో 6.53 క్వింటాళ్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. జిల్లాలో సగటున ఎకరా 13వేల రూపాయల చొప్పున కౌలుకు తీసుకున్నారు. ఇతర జిల్లాల్లో ఎకరా రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ఉంది. గులాబీ పురుగు, వరస వర్షాలు కురవడంతో మొదట్లోనే పత్తి వేసిన రైతులకు భయం పట్టుకుంది. దీంతో కొంతమంది పెట్టుబడిని కూడా లెక్కచేయక ప్రారంభంలోనే పొలాలను వదిలేశారు. దిగుబడి పెరుగుతుందేమో అనే ఆశతో అలాగే సాగిన రైతులకు కాలం కలిసి రాలేదు. దీంతో కొంతమంది భూ యజమానులు రెండు రూపాయల వడ్డీపై నోట్లు రాయించుకుంటున్నారు. పత్తి తీతలు ప్రారంభమైన అక్టోబరులో క్వింటాలు రూ.2,500 కంటే తక్కువకే అమ్ముకున్నారు. రెండో తీత నాటికి క్రమంగా ధర పెరుగుతూ క్వింటా రూ.4,500 వరకు చేరింది. డిసెంబరులో రూ.5వేలకు పైగా పలికింది. మొత్తం పంటలో సగమే ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. చివరితీత పత్తి నాణ్యత లేదంటూ రూ.4వేల లోపే ఇస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ కౌలు రైతులతోపాటు సొంత భూములున్న వారూ నష్టాలు మూటగట్టుకున్నారు. గులాబీ రంగు పురుగు వల్ల కాయ సరిగా విచ్చుకోలేదు. గుడ్డిపత్తిగా మారింది. బరువు కూడా తక్కువే. దీన్ని తీయాలన్నా కూలీలకూ కష్టమే. కిలోకు రూ.200 కూలీ ఇస్తేనే తీస్తామని కొన్నిచోట్ల కూలీలు స్పష్టం చేస్తున్నారు. ఇంత ఖర్చుతో తీయించినా వ్యాపారులు నాణ్యత లేదంటూ క్వింటాకు రూ.3వేల నుంచి రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో చెరిసగం అనే ప్రతిపాదన తెస్తున్నా తీసేవారు కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు.ప్రభుత్వం రైతులు పక్షపాతి అని చేస్తున్న ప్రకటనలకు, చేతలకు పొంతన లేదని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి సత్వర చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు.