YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలవరపెడుతున్న తిరుమల కాలుష్యం

కలవరపెడుతున్న తిరుమల కాలుష్యం
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులను కాలుష్యం వెంటాడుతుంది. ప్రముఖ పట్టణాల, పారిశ్రామిక వాడల్లో వెలువడే స్ధాయిలో కాలుష్యం తిరుమలలో నమోదు కావడం ఇప్పుడు అధికారులను కలవరపెడుతొంది. ప్రధానంగా వాహన కాలుష్యం పరిధులు దాటుతుండడంతో, కాలుష్య నియంత్రణ దిశగా టీ.టీ.డీ అడుగులు వేయాల్చిన అవసరం ఉంది. లేదంటే భావితరాలకు తిరుమల అథ్యాత్మిక, ప్రకృతి అందాలను అందించలేమని పరిస్థితి కనిపిస్థున్నది. కాలుష్యం మరింత కోరలు చాచకముందే టీటీడీ దేవస్థానం అదికారులు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో ఉండే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు. ఇలా రోజుకు సుమారు పది వేల వాహనాల దాకా రాకపోకలు తిరుపతి నుంచి తిరుమలకి, తిరుమల నుంచి తిరుపతి మద్యన సాగుతుంటాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో కెల్లా ఇంధన వ్యయం, అందుకు తగ్గ రాబడి తెచ్చి పెడుతూ రాష్ట్రంలో ద్వితియ స్ధానంలో తిరుమల-తిరుపతి ఆర్టీసీ విభాగం ఉంది. అదే స్థాయిలో తిరుమల కాలుష్య ప్రమాదంలో పడటానికి ఆర్టీసీ బస్సులు కూడా ఒక రకంగా దోహద పడుతున్నాయి. వాహనాల కారణంగా తిరుమలకి ఎంత మేరకు కాలుష్యం వల్ల కలిగే ప్రమాదం పొంచి ఉందో కూడా ఆర్ధం చేసుకోవచ్చు. వేలాది మంది భక్తులను తిరుమలకు తీసుకెళ్ళి మళ్ళీ తిరుపతికి తరలిస్తుంటాయి ఆర్టీసీ బస్సులు. ఘాట్ రోడ్లలో ఆర్టీసీ ప్రయాణం నిజంగా సురక్షితం. అందుకే భక్తులు సైతం బస్సుల్లోనే ప్రయాణానికి మెగ్గు చూపుతారు. ఇవేకాక రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాలతో పాటు ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకి అధికంగా ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో పాటు తిరుమల-తిరుపతిలోని వివిధ వాహనాలతో కూడిన సొంత వాహనాలు, ప్రైవేటు ట్రావెల్స్ వారి సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యంతో కొండకు ముప్పు వాటిల్లుతొంది. నిత్యం ఘాట్ రోడ్డు మార్గాల గుండా ప్రయాణించే వాహనాలలో అధికశాతం కాలం చెల్లిన వాహనాలు నడుస్తున్నాయి. సాధారణ రోడ్లలో వీటి నుంచి వెలువడే కాలుష్యం అంతగా తెలియక పోయినా, ఘాట్ రోడ్లలలో మాత్రం వీటి నుంచి వెలువడే కాలుష్యం అధికస్ధాయిలో ఉంటుంది. చుట్టు ప్రక్కల వాతావరణాన్ని కాలుష్య మయం చేస్తున్నా టీటీడీకి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీని వల్ల శేషాచలం అటవీ ప్రాంతాల్లో వెలసిన ఎన్నో జీవరాసులు ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకుని చనిపోతున్న పరిస్థితి నెలకొంది.  ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టీటీడీని సంప్రదించింది. కొండపై వాతవరణ పరిస్దితులు, కాలుష్యం తదితరాలపై ఆంచనా వేసేందుకు తొలివిడతగా కోటిన్నర రూపాయలతో ఓ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసింది. అయితే పూర్తిస్దాయిలో ఇంకా ప్రారంభంకాని కాలుష్య ఆధ్యయనంలో ఊహించని విధంగా రిపోర్టు నమోదు కావడంతో నిపుణులను సైతం ఆందోళనలో పడేస్తున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కాలుష్య రహిత తిరుమలగా తీర్చాలని పోలీసులు అంటున్నారు.టీటీడీ అధికారులు కూడా తిరుమలలో వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Related Posts