Highlights
- భారతీయ తత్వశాస్త్రం. (23)
- భారత దేశము - ఆధునిక యుగము.
మహాత్మా గాంధీ తత్వం, ఆచరణ.
గాంధీకి మానవ జీవితానికి సంబంధించిన విషయాలపై నిశ్చితాభిప్రాయాలున్నాయి.
అప్పటికే ప్రపంచం దృష్టిలో గొప్ప ఆధ్యాత్మిక దేశంగా చెప్పుకొనే భారతదేశంలో శుచిశుభ్రతల పట్ల అలక్ష్యాన్ని గాంధీ తీవ్రంగా నిరసించాడు.
మలమూత్ర విసర్జనాశాలలు నిర్మాణం నుండి ప్రతి విషయంపైనా అవగాహన కలిగించేటందుకు ఆయన అనేక రచనలు చేసేవాడు. ఈ విషయంలో యూరోపియన్ జాతుల నుండి నేర్చుకోవలసింది ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్దారు.
అలాగే గాంధీ బ్రహ్మచర్యానికి, లైంగిక నిగ్రహానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు.
అలాగే మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల నిషేధానికి ఆయన తన పోరాట కార్యక్రమాలుగా చేసుకొని ప్రచారం చేశాడు.
గాంధీ ప్రాధాన్యత నిచ్చిన మరొక ముఖ్యమైన అంశం మహిళా సముద్దరణ.
అస్పృశ్యతా నిర్మూలన తర్వాత గాంధీ అధిక ప్రాధాన్యమిచ్చిన మరొక అంశం మహిళా సముద్ధరణ.
తరతరాలుగా, ఎన్నో వందల సంవత్సరాలుగా భారత జాతి స్త్రీలను అణగ ద్రొక్కి ఉంచింది. వారిని పడకటింటికే పరిమితం చేసిందని గాంధీ బావించారు.
స్త్రీలు పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలని, వారు అన్ని రంగాలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఎలుగెత్తి చాటాడు.
అస్పృశ్యతా నిర్మూలన విషయంలే వలె, స్త్రీల హక్కుల విషయంలోనూ తనకు ముందు ఉద్యమాలు నడిపిన దాదాభాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే వంటి మితవాద నాయకుల నుండి స్ఫూర్తి పొందారు.
హిందూ, ముస్లిం సఖ్యత కోసం తన జీవితాంతం తీవ్రంగా కృషిచేసిన గాంధీ.
ఆనాటి భారతదేశంలో అతి ముఖ్య సమస్యలలో ఒకటైన హిందూ, ముస్లిం సఖ్యత గాంధీ జీవిత లక్ష్యాలలో ఒకటి. దురదృష్టవశాత్తు ఆయన ఈ లక్ష్య సిద్ధికై ఎంతగా పరిశ్రమించారో అంతగా అది ఆయన జీవిత కాలంలోనే విఫలమైంది.
దేశ విభజనకు ముందు గాంధీజీ ఆనాడు మతకలహాలు భయంకరంగా చెలరేగుతూ మృత్యుదేవత అడుగడుగునా విలయతాండవం చేస్కున్న తరుణంలో నౌఖాలిలో, కలకత్తాలో, పాట్నాలో, డిల్లీలో ఎలాంటి హిందూ ముస్లిం సమైక్యతకై పర్యటించాడు.
దేశ విభజన తర్వాత జరిగిన ఘోరమత కలహాలు గాంధీ అహింసా సిద్ధాంతానికి హిందూ, ముస్లిం సమైక్యతా ప్రయత్నాలకు తూట్లు పొడిచాయి.
ముస్లింలు అతనిని హిందూ నాయకుడుగా జమకట్టగా, హిందువులు ఆయనను ముస్లిం పక్షపాతిగా పరిగణించారు. చివరికీ ఈ ప్రయత్నంలోనే హిందూ మతోన్మాది ఆయనను బలిగొన్నాడు.
- బండారు వెంకటేశు.(సత్యాన్వేషి) (9440402625)