యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఉగ్రవాదంపై పోరు పట్ల చర్చించే సమయం దాటిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఇవాళ అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషియో మాక్రీతో జరిగిన సమావేశం అనంతరం ప్రధాని మోదీ మీడియా ప్రకటన చేశారు. ఆ సమయంలో పుల్వామా కారు బాంబు దాడి ఘటన గురించి మాట్లాడారు. హేయమైన పుల్వామా దాడితో చర్చలకు కాలం చెల్లిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ఏకం కావాలని, మద్దతుదారులంతా కఠిన చర్యలు చేపట్టాలని మోదీ అన్నారు. పుల్వామా మృతుల కుటుంబాలకు అర్జెంటీనా అధ్యక్షుడు సంతాపం తెలిపారు. ఉగ్రవాద దాడులను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కలిసి కట్టుగా పనిచేస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హౌజ్‌లో జరిగిన భేటీలో రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి.