YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

తెలుగు మీడియం అభ్యర్థులకూ ఇంగ్లీష్ పేపర్

Highlights

  • వెబ్‌సైట్‌లో టీఆర్టీ హాల్ టికెట్లు
  •  24న తెలుగు పండిట్, 
  • స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలు
తెలుగు మీడియం అభ్యర్థులకూ ఇంగ్లీష్ పేపర్

టీఆర్టీ తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌లో టీఆర్టీ హాల్ టికెట్లను పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.  పరీక్ష కేంద్రాల  కేటాయింపులో లోపాల కారణంగా హాల్‌టికెట్ల డౌన్‌లౌడ్‌ను నిలిపేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 24న తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్ష నిర్వహిస్తారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పోస్టుల పరీక్షకు హాజరయ్యే తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్న అభ్యర్థులకు ఇంగ్లిషులో కూడా ప్రశ్నాపత్రం ఉండేలా చేయాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. పీఈటీ సిలబస్ ఇంగ్లిషులో ఉందని, తెలుగులో పశ్నాపత్రం ఉంటే అభ్యర్థులు నష్టపోతారని పేర్కొంటూ నల్లగొండకు చెందిన వెంకటరమణ దాఖలు చేసిన రిట్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. పశ్నాపత్రం తెలుగుతోపాటు ఇంగ్లిషు కూడా ఉండేలా చేయాలని టీఎస్‌పీఎస్సీని న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు ఆదేశించారు.టీఆర్టీ తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

Related Posts