యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రభుత్వం కౌలు రైతులు, 5 ఎకరాల పైబడి ఉన్న రైతులకు రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తుంది. మొదటిగా భూమి ఉన్న రైతులకు అన్న దాత సుఖిభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులందరిని గుర్తించిన తర్వాత మే, జూన్లో కౌలు రైతులకు పెట్టుబడి సాయం అదిస్తాం. కేంద్రం ఇవ్వని రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ముఖ్యమంత్రి లిప్టులన్నింటిని పుననిర్మాణం చేసి చివరి ఎకరావరకు నీరు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రధాన్యం ఇచ్చి రూ. 70 వేల కోట్లు ఖర్చు చేసింది. పంటల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం మద్ధతు ధరతో పంటను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. పంటలకు దిగుబడి విషయంలో అన్ని రాష్ట్రాలకు కంటే ముందున్నాం.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వ్యవసాయంలో చారిత్రాత్మకమైన మార్పులను తీసుకువచ్చిందని అన్నారు.
ఏప్రిల్ 5 లోపల రైతు రుణమాఫీ 10శాతం వడ్డితో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథాకానికి రూ 2 వేల కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు సమర్థతో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభపవపేరుతో చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కంటే ముందే రైతుల ఖాతాల్లో రూ వేయి రూపాయలు జమ చేశాం. కొండవీడు కోట ఉత్సావాలకు 1.50 వేల మంది హాజరయ్యారు. కొండవీడు కోటను ప్రంపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఏటా కొండవీడు కోట ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. కొండవీడు కోట ఉత్సవాలను విజయవంతం చేయడానికి పని చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.