యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న నేతలను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారని అన్నారు. అలా పోయే వారిని పట్టించుకోవద్దని నేతలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే అని తేల్చిచెప్పారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలతో జగన్ కు ఫ్రస్టేషన్ పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్ లో కూర్చుని కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీపడిందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావని సీఎం చంద్రబాబు అన్నారు. పుల్వామా దాడిపై మమతా బెనర్జీ అనుమానాలపై దేశంలో చర్చ జరిగింది. దేశభక్తిలో, భద్రతలో టిడిపి రాజీపడదు. రాజకీయ లబ్దికోసం దేశాన్ని తాకట్టు పెట్టడాన్ని సహించమని అయన అన్నారు. నరేంద్రమోది ఏ అరాచకానికైనా సమర్ధుడు. గోద్రాలో 2 వేలమంది నరమేధాన్ని మరువలేం. విదేశాలు కూడా మోదిని బాయ్ కాట్ చేశాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరంగా వుందని అన్నారు. సరిహద్దు రాష్ట్రాలలో రాజకీయ లబ్దిని చూడరాదు. బిజెపి రాజకీయాలతోనే జమ్ము-కాశ్మీర్ లో సంక్షోభం నెలకోంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,000 వేశాం. డబ్బు తీసుకోడానికి రైతులకు ఇబ్బందులుండవని అన్నారు. అన్నదాత సుఖీభవ’ ను రైతులంతా స్వాగతిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ’ పేరుతో ఎడ్లబండ్ల ర్యాలీలు చేయాలి. నవధాన్యాలతో, పండ్లతో ఎడ్లబండ్ల అలంకరణలు చేయాలి. రైతుల్లో సంతోషం రాష్ట్రానికి సుభిక్షం. ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఏపిలో రైతులకు చేసినంతగా దేశంలో ఎక్కడా జరగలేదు. రూ.24వేల కోట్ల రుణమాఫీ, విపత్తు సాయం పెంచుతున్నాం. కౌలురైతులకు రూ.15వేల పెట్టుబడి సాయం,9 గం విద్యుత్ సరఫరా చేస్తాం. మన రాష్ట్రంలో రైతులకు ఎన్నో వినూత్న పథకాలు తెచ్చాం. సమర్ధ నీటి నిర్వహణతో దిగుబడులు పెరిగాయి. 60 లక్షల మందికి పెన్షన్లు 10రెట్లు చేశాం. పేదల సంక్షేమానికి ఏపి ఒక నమూనా. పసుపు-కుంకుమ,అన్నదాత సుఖీభవ,ఎన్టీఆర్ భరోసాకు ప్రజల్లో బ్రహ్మరథం. సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ పెరిగిందని అన్నారు.