YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.

మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో: 

ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది.
రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు,
అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.
ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు.

వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.
( శ్రీ చాగంటి వారి అమృత ప్రవచనములు )

సూర్య మహాత్ముని అవతరణ..
బ్రహ్మపురాణములో ఇతిహాసగాధ ప్రకారం.. శ్రీమన్నారాయణుడి వర ప్రధానంతో బ్రహ్మ ఉద్బోధనతో దక్ష ప్రజాపతి దంపతులకు ఈసారి..
60 మంది కుమార్తెలు కలిగారు.
దక్షుడు వారిలో..
10 మందిని యమధర్మరాజుకు,
13 మందిని కశ్యప మునికి,
27 మందిని చంద్రునికి,
ఇద్దరిద్దరు చొప్పున భూతుడికి,
అంగిరసుడికి, కృశాశ్వుడికి,
మిగిలిన నలుగురిని తార్ష్యునికి ఇచ్చి వివాహం చేశాడు.

తార్ష్యుని భార్యలు..
వినత,
కద్రువ,
పతంగి,
యామిని.
వీరిలో పతంగికి పక్షులు,
యామినికి మిడతలు,
వినతకు( స్థావర జంగము)  గరుత్మంతుడు,
అనూరుడు పుట్టగా
కద్రువకు సర్పాలు పుట్టాయి.

చంద్రుని భార్యలు కృత్తికాది 27 నక్షత్రాలు.
దక్షుని కూతుళ్ళందరికీ సంతానం కలిగింది.
అలా పుట్టినవారిలో దేవతలున్నారు, రుద్రగణాలున్నాయి,
భయంకరులైన ప్రేతలు,పితృగణాలు కూడా ఉన్నాయి.

కశ్యపుని భార్యలలో తిమికి జలచరాలు,  .....
సురసకు రాక్షసులు,
అరిష్టకు గంధర్వులు,
దనువుకు దానవులు 18 మంది పుట్టారు.
దితికి దైత్యులు జన్మించారు
అసురుల ఆట కట్టించగల అపారశక్తిమంతుడిని
బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్ధించింది.

గర్భం ధరించి  అలాంటి పుత్రునికై వ్రతాలూ, ఉపవాసాలూ చేస్తున్న అదితిని కశ్యపుడు ఎగతాళిగా బిడ్డను ఆకలితో చంపేస్తావా అని అరిచాడు.
ఆ మాటకు తల్లి మనసు గాయపడి నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది.
నేలమీదపడ్డ ఆ అండం వేడికి సృష్టి తల్లడిల్లింది. అదితీకశ్యపుల ప్రార్ధనతో ఆ అండం పగిలి వెలుగులు వెదజల్లుతూ బాల భానుడు అవతరించాడు.
అదితి గర్భాన శ్రీమన్నారాయణుడు భానుడుగా అవతరించాడు.
ఆ రోజు మాఘశుద్ధ సప్తమి. "రధసప్తమి".
అదితికి  భానుడు గాక 12మంది ఆదిత్యులు పుట్టారు. అదితికి జన్మించినవారు సాత్విక గుణములు కలవారు  దేవతలు.
మిగిలినవారికి జన్మించినవారు రాజసిక, తామసిక గుణములు కలిగినవారు.

కాలమానం,
క్షణం,
ముహుర్తం,
పగలు,
రాత్రి,
రోజులు,
వారాలు,
పక్షాలు,
మాసాలు,
సంవత్సరాలు,
ఋతువులు,
ఆయనాలు
ఇవన్నీ సూర్యకాలగమనము వలన ఏర్పడ్డాయి.

ద్వాదశాదిత్యులు:
ఆదిత్య,
సవిత,
సూర్య,
మిహిర,
అర్క,ప్రభాకర,
మార్తాండ,
భాస్కర,
భాను,
చిత్రభాను,
దివాకర,
రవి.

సూర్యుడు చైత్రమాసం మొదలుకొని ఏ మాసంలో
ఏ నామంతో ప్రవర్తిస్తాడో సూతుడు తెలియజేస్తున్నాడు...

ద్వాదశాదిత్యులు.
శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒక్కడే.. అయినా కాలాన్ని బట్టి కార్యభేదాన్నిబట్టి ఋషులు అభివర్ణించారు.

చైత్రంలో..
సూర్యుడిని ధాత అంటారు.
కృతస్థలి అప్సరగా,
హేతి రాక్షసుడిగా,
వాసుకి సర్పంగా,
రధకృతుడు యక్షుడిగా,
పులస్త్యుడు రుషిగా
తుంబరుడు గంధర్వుడుగా
వారి పనులు వారు నిర్వర్తిస్తారు.

వైశాఖంలో.
సూర్యుడు అర్యముడు.
పులహుడు రుషి,
అధౌజుడు యక్షుడు,
పుంజిక స్థలి అప్సర,
ప్రహేతి రాక్షసుడు,
నారదుడు గంధర్వుడు,
కచ్చనీరుడు సర్పంగా
కార్యనిర్వహణ చేస్తారు.

జేష్ఠంలో..
సూర్యుడు మిత్రుడు,
అత్రి రుషి,
పౌరుషేయుడు రాక్షసుడు,
తక్షకుడు సర్పం,
మేనక అప్సర,
హాహా గంధర్వుడు,
రధస్వనుడు యక్షుడు.

ఆషాఢమాసంలో..
సూర్యుడిని వరుణుడంటారు.
ఆయన కార్యవర్గంలో వసిష్ఠుడు రుషి,
రంభ అప్సర,
సహజన్యుడు యక్షుడు,
హూహూ గంధర్వుడు,
శుక్రుడు నాగరాజు,
చిత్రస్వనుడు రాక్షసుడిగా ఉంటారు.

శ్రావణ మాసంలో..
సూర్యుని ఇంద్రుడు అంటారు.
అనుచరులుగా విశ్వాసువు గంధర్వుడు,
శ్రోత యక్షుడు,
ఏలా పత్రుడు నాగం,
అంగిరా రుషి,
ప్రంలోచ అప్సర,
వర్యుడు రాక్షసుడు ఉంటారు.

భాద్రపదంలో.
సూర్యుడు వివస్వనుడు.
ఆయనకు తోడుగా ఉగ్రసేనుడనే గంధర్వుడు, వ్యాఘ్రుడనే రాక్షసుడు,
ఆసారణుడనే యక్షుడు,
భృగువనే రుషి,
అనుమోచ అనే అప్సర,
శంఖుపాలుచనే నాగరాజు ఉంటారు.

ఆశ్వయుజంలో.
సూర్యుడు త్వష్టా,
జమదగ్ని రుషి,
కంబళనాగుడు,
తిలోత్తమ అప్సర,
బ్రహ్మాపేత రాక్షసుడు,
శతజిత్తు యక్షుడు.
ధృతరాష్త్ర గంధర్వుడు
తమ కార్యాల్ని నిర్వర్తిస్తారు.

కార్తీక మాసంలో..
సూర్యుడు విష్ణువు.
అశ్వతరనాగుడు,
రంభ అప్సర,
సూర్యవర్చాగంధర్వుడు,
సత్యజిత్ యక్షుడు,
విశ్వామిత్రుడు రుషి,
మరవాపేతుడు రాక్షసుడు
సూర్యగణంలో ఉంటారు.

మార్గశిర మాసంలో..
సూర్యుడు అంశువు.
కశ్యప రుషి,
తార్ క్ష్యుడు యక్షుడు,
రుతసేనుడు గంధర్వుడు,
ఊర్వశి అప్సర,
విద్యుచ్చత్రుడు రాక్షసుడు,
మహాశంఖుడు నాగరాజు.

పుష్యమాసంలో.
భగుడు సూర్యుడు.
స్పూర్జ

ుడు రాక్షసుడు,
అరిష్టనేమి గంధర్వుడు,
ఊర్ణుడు యక్షుడు,
ఆయువు రుషి,
పూర్వచిత్తి అప్సర,
కర్కోటకుడు నాగరాజు.

మాఘమాసంలో.
సూర్యుడు పూషుడు.
ఆయన పరివారంలో ధనుంజయుడనే నాగం,
వాత రాక్షసుడు,
సుషేణగంధర్వుడు,
సురుచి యక్షుడు,
ఘృతాచి అప్సర,
గౌతమ రుషి ఉంటారు.

ఫాల్గుణమాసంలో.
సూర్యుడు పర్జన్యుడు.
క్రతు యక్షుడు,
వర్చా రాక్షసుడు,
భరద్వాజరుషి,
సేనజిత్ అప్సర,
విశ్వగంధర్వుడు,
ఐరావతసర్పం
ఆయనకు తోడుగా ఉంటాయి.

ఇలా ఆరుగురు అనుచరులతో సూర్యనారాయణుడు
12 మాసాలలో సంచరిస్తూ ఉపాసన చేసే భక్తుల పాపాలను నిర్మూలిస్తాడు.
ఆయన అలా నడుస్తుంటే వేదమంత్రాలు చదువుతూ రుషులు స్తుతిస్తారు.
అప్సరసలు నృత్యం చేస్తారు.
గంధర్వులు పాటలు పాడుతారు.
నాగరాజులు రధానికి పగ్గాలుగా ఉంటారు.
యక్షులు రధాన్ని అలంకరిస్తారు.
రాక్షసులు రధాన్ని వెనుకనుంచి తోస్తారు.
60వేలమంది వాలఖిల్యులనే మహర్షులు సూర్యునివైపు చూస్తూ స్తుతి పాఠాలు చదువుతుంటారు.

ఇలా ఆదిమధ్యాంతరహితుడైన ఆదినారాయణుడు తన్ను తాను విభజించుకొంటూ..
ప్రతికల్పంలోనూ ప్రజలను పోషించి, పాలిస్తుంటాడు.

సూర్యభగవానుని ప్రార్ధిస్తూ భక్తితో ఆవాహన చేసి, స్తవనం, జపము, నామస్మరణ మొదలగు షోడశోపచారములు, స్నాన,పుష్ప,ఫల,ధూప,దీప,నైవేద్య, ఆరతులతో ఆరాధించి..
బ్రాహ్మణులకు దక్షిణ సమర్పించి,
భజన,కీర్తనలతో సూర్యభగవానునికి మనసారా సూర్యప్రదక్షిణ నమస్కారములు సమర్పించాలి.
ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు సూర్యనమస్కారాలతో పఠించాలి.
సర్వం శుభంకరం.స్వస్తి..!!

ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!

Related Posts