యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంగళవారం నాడు భేటీ అయని టిటిడి పాలకమండలి, లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 3,116 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. తిరుమల నీటి అవసరాల కోసం కల్యాణి డ్యామ్ నుండి శ్రీవారి మెట్టు వరకు రెండవ పైప్ లైన్ నిర్మాణానికి 8.50 కోట్లతో టెండర్లకు ఆహ్వానించాలని నిర్ణయించింది. తిరుమలలోని అద్దె గదుల నిర్వహణ కోసం మూడేళ్ళ కాలానికి వివిధ సంస్థలకు 53 కోట్లు కేటాయింపుకు అమోదం తెలిపింది. రూ 4.95 కోట్లతో తిరుమలలోని వైకుంఠం వద్ద నూతన వంటశాల నిర్మాణం, తిరుమలలోని పంచాజన్యం అతిథిగృహం వద్ద రూ 12.56 కోట్లతో మరో వంటశాల నిర్మాణం కు ఆమోదం ఇచ్చింది. యాత్రికుల వసతి కోసం రూ 47.44 కోట్లతో నూతన అతిధి గృహం నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. శ్రీవారి ఆలయ పోటు కార్మికుల కోసం తిరుమలలోని ఎఫ్.టైప్ క్వార్టర్స్ వద్ద రూ 3.65 కోట్లతో గదుల నిర్మాణం, తిరుపతిలోని శ్రీనివాస, పద్మావతి కళ్యాణమండపాల ఆధునీకరణ కు రూ 8.32 కోట్ల నిధులు కేటాయింపులకి అమోదం తెలిపింది. శ్రీవారి ఆలయ పోటులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు మరో ఏడాది పదవీకాలం పొడిగింపు కు ఆమోదం తెలిపింది.