YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా

విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

చదువు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తోన్న విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా ఝుళిపించింది. పక్కా ప్రణాళిక ప్రకారం వల వేసి పట్టుకుంది. నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వచ్చేవారి కోసం ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించిన ఫెడరల్ ఏజెంట్స్.. స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించి అక్రమ వలసదారులను గుర్తించారు. వీరిలో అత్యధికంగా తెలుగు విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. వివరాలు ఇలా ఉన్నాయి.. అది ది యూనిటివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్. ఈ వర్సిటీలో స్టాఫ్ లేరు. ఇన్‌స్ట్రక్టర్లు లేరు. అసలు ఈ యూనివర్సిటీకి ఒక కర్రిక్యులమే లేదు. క్లాసులు కూడా జరగవు. కానీ విద్యార్థులు మాత్రం 600 మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా వలసవచ్చి చేరినవారే. యూనివర్సిటీలో విద్యార్థులుగా ప్రవేశం పొంది వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ తతంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ‘హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ ఏజెంట్లు పూర్తి వివరాలను ట్రంప్ ప్రభుత్వానికి అందజేశారు. దీంతో ఈ అక్రమ వ్యవహారం బుధవారం బయటపడింది. ఈ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం రిక్రూటర్స్‌గా వ్యవహరించిన 8 మంది తెలుగు వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. యూనివర్సిటీలో ప్రవేశం పొందిన సుమారు 600 మంది విద్యార్థులు విదేశీయులే అని అధికారులు గుర్తించారు. వీరంతా అక్రమంగా, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో యూఎస్‌లో ఉంటున్నారని, విద్యార్థుల పేరిట చలామనీ అవుతున్నారని తేల్చారు. వీరికి యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించింది ఈ 8 మంది భారత పౌరులేనని నిర్ధారించారు. ఈ 8 మందితో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌కు చెందిన చాలా మంది విద్యార్థులను ఫెడరల్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 
అరెస్టయిన తెలుగు వ్యక్తులు: 
భరత్ కాకిరెడ్డి (29) - లేక్ మ్యారీ, ఫ్లోరిడా 
అశ్వంత్ నూనె (26) - అట్లాంటా 
సురేష్ రెడ్డి కందాల (31) - కుల్‌పెపెర్, వర్జీనియా 
ఫణిదీప్ క్రాంతి (35) - లూయిస్‌విల్లే, కెంటుకీ 
ప్రేమ్ కుమార్ రామ్‌పీసా (26) - చార్లెట్, నార్త్ కరోలినా 
సంతోష్ రెడ్డి సామ (28) - ఫ్రెమోంట్, కాలిఫోర్నియా 
అవినాశ్ తక్కళ్లపల్లి (28) - హరిష్‌బర్గ్, పెన్సిల్వేనియా 
నవీన్ ప్రత్తిపాటి (29) - డల్లాస్

Related Posts